'హ్యాపీ హ్యాపీగా' వచ్చి వారం కూడా కాలేదు..అప్పుడే
వరుణ్ సందేశ్ హీరోగా చేసిన 'హ్యాపీ హ్యాపీగా' మొన్న శుక్రవారం విడుదలైంది.అప్పుడే సక్సెస్ మీట్స్ స్టార్ట్ చేసేసారు. సరిగ్గా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోర్ చిత్రంగా టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం సక్సెస్ మీట్ లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... "అసభ్యత, అశ్లీలత లేని చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడొచ్చు. మణిశర్మ సంగీతం, అనిల్ సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. కథలోని భావోద్వేగాలను చక్కగా తెరమీద చూపించారు. అలీ పాత్ర కూడా నచ్చుతుంది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు చూసినవాళ్లు, పంపిణీదారులు అందరూ హ్యాపీగా ఉన్నారన్నారు. ఇక నిర్మాత దుర్గాప్రసాద్ వడ్లమూడి అయితే ఈ ముక్కోణపు ప్రేమకథని యువతరంతో పాటు పెద్దవారికీ నచ్చేలా తీశామని చెప్తున్నారు. ఈ చిత్రానికి వస్తోన్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. అదీ సంగతి.
హ్యాపీ హ్యాపీగా వరుణ్ సందేశ్ వేగ శరణ్య మోహన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ happy happy ga varun sandesh durga prasad vega saranya mohan


Click it and Unblock the Notifications