రైటర్ ని డైరక్టర్ ని చేస్తున్న వరుణ్ సందేశ్
మరో రచయిత ...దర్శకుడు కాబోతున్నాడు. తెలుగులో పలు చిత్రాలకు డైలాగులు రచించిన నంధ్యాల రవి త్వరలో వరుణ్ సందేశ్ ని డైరక్ట్ చేయబోతున్నాడు. ఇది పూర్తి స్ధాయి ప్రేమ కధా చిత్రమని తెలుస్తోంది.కుమార్ బ్రదర్శ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి కమర్షియల్ విలువతో నిండిన వినోదాత్మక ప్రేమ కధా చిత్రమని, త్వరలోనే షూటింగ్ మొదలుకానుందని నిర్మాతలు చెప్తున్నారు. ఇక గతంలో కుమార్ బ్రదర్శ్...సుమంత్ హీరోగా 'రాజ్" అనే చిత్రాన్ని వియన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించారు. ప్రియమణి, విమలారామన్ హీరోయిన్స్ గా చేసిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంకు ముందు ఈ నిర్మాతలు నా గర్లె ప్రెండ్ బాగా రిచ్, సాధ్యం సినిమాలు నిర్మించారు. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే అతను ప్రస్తుతం ప్రియుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుణ్ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్ హీరో హీరోయిన్ లుగా రూపొందుతున్న చిత్రం 'ప్రియుడు". శ్రావణ్ దర్శకత్వంలో యుకె ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











