ఆలోచింప చేసే ప్రేమ కథ('కుదిరితే కప్పు కాఫీ' ప్రివ్యూ)

By Srikanya

లవర్ బోయ్ వరుణ్ సందేశ్ తాజా చిత్రం కుదిరితే కప్పు కాఫీ చిత్రం ఈ రోజే(శుక్రవారం) విడుదల అవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో సాగే కథగా చెప్తున్న ఈ కథలో వేణు పాత్రను వరుణ్ సందేశ్ చేసారు. అతనిదో డిఫెరెంట్ క్యారెక్టర్. డిగ్రీ పూర్తి చేసిన వేణు ఏ పని చెయ్యటానకి ఇష్టపడడు. ఏదైనా ఎందుకు చెయ్యాలని ప్రశ్నిస్తూంటాడు. అతనికి పూర్తి విరుద్దమైన అమ్మాయి లాస్య (సుమా భట్టాచార్య). ఒక లక్ష్యం కోసం పాటుపడే ఈ అమ్మాయి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని. ఆమె ఒక హిల్‌స్టేషన్‌లో కాఫీ షాప్‌ నడుపుతుంటుంది. దాన్ని ఓ పెద్ద రిసార్ట్‌గా మార్చాలన్నది ఆమె కోరిక.ఇలా ఒకరు లక్ష్యం లేకుడా తిరిగే వ్యక్తి,మరొకరు లక్ష్యమే జీవితం అనుకునే క్యారెక్టర్. వీరిద్దరి మధ్యా ఎలా ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ వీరిలో ఎలా మార్పు తీసుకు వచ్చింది అనేది తెరపై చూడాల్సిన విషయం. ఇక ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ ''ఓ కల, కలయిక మధ్య సాగే కథ ఇది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయినప్పుడు పుట్టేదే ప్రేమ అని చెబుతున్నాం. ఇద్దరి కలల కలహం ఏ తీరానికి చేరిందన్నది ఇందులో ప్రధానం. మనం చూస్తున్న అన్ని ప్రేమకథల్లోనూ ఆకర్షణతోనే రెండు మనసులు కలుస్తాయి. కానీ మా కథలోని జంట మధ్య ప్రేమ చిగురించిన సందర్భం అందర్నీ ఆలోచింపజేస్తుంది. యోగీశ్వర శర్మ స్వరాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు.

సంస్థ: మూన్‌వాటర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: వరుణ్‌ సందేశ్‌, సుమా భట్టాచార్య, తనికెళ్ల భరణి, భీమనేని శ్రీనివాసరావు, సుకుమారి, శివన్నారాయణ తదితరులు
సంగీతం: యోగీశ్వర శర్మ
నిర్మాతలు: మహి, శివ
దర్శకత్వం: రమణ సాల్వ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X