వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' కూడా అప్పుడే!?
దిల్ రాజు మాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రీమేక్ చేస్తున్న'మరో చరిత్ర' చిత్రం జనవరి రెండో వారంలో రిలీజ్ అవుతుందని సమాచారం. సంక్రాంతికి రిలీజవుతున్న పెద్ద చిత్రాల సరసన దీన్నీ వేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనిత అనే అమ్మాయి పరిచయమవుతోంది. ప్రసుతం హైదరాబాద్ లో షూటింగ్ చేసుకుంటున్న ఈ చిత్రం ఇంతకుముందు వైజాగ్,యు.ఎస్ లలో కంటిన్యూ షెడ్యూల్స్ లలో పూర్తి చేసారు. అలాగే దుబాయి ప్లాన్ చేసిన సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయి.
రవి యాదవ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంగ్లీష్, తెలుగు కలిపి మాట్లాడుతూంటుంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్నీ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రీమేక్ లో ఒరిజనల్ లో ఉన్న ట్రాజడి ఎండింగ్ ని తీసి చేస్తున్నట్లు తెలిస్తోంది. ఆ మద్య దేవదాస్ ని హిందీ లో దేవ్ డి పేరట రీమేక్ చెస్తూ ఎండింగ్ మార్చి హిట్ కొట్టారు. అదే విధంగా కాలానికి తగినట్లు గా ఈ క్లాసిక్ లో కొన్ని మార్పులు చేస్తునట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ రవి యాదవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. రవి గతంలో పలు బాలీవుడ్ చిత్రాలకు కెమెరా అందించారు. వాటిలో ముఖ్యంగా ఐత్ రాజ్, సోఛాలతా, నఖీభ్, 36 చైనా టౌన్, రేస్ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో ఈ చిత్రం కూడా విజువల్ గా మంచి స్టాండర్డ్స్ తో ఉంటుందని ఆశిస్తున్నారు.ఈ చిత్రం తర్వాత వరుణ్ సందేశ్ దర్గా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ చిత్రాలు కమిట్ అయ్యారు. దుర్గా ఆర్ట్స్ కి దర్శకుడుగా రాజసింహ పనిచేయనున్నారు. గీతా ఆర్ట్స్ చిత్రానికి సుకుమార్ డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











