వరుణ్ సందేష్ కి యాక్సెడెంట్..
యువ నటుడు వరుణ్ సందేశ్ రీసెంట్ గా ఏక్సిడెంట్ కి గురిఅయ్యాడని సమాచారం. దాదాపు ఇరవై ఐదు కుట్లు దాకా పడ్డాయని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ ని బయిటకు పొక్కనీయలేదు. ఆనంది ఆర్ట్స్ నిర్మిస్తున్న పొల్లాదవన్ రీమేక్ లో చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా రాత్రి పూట హైటెక్ సిటీలో ఆటో లో ఓ ఫైట్ సీక్వెన్స్ ని తీస్తున్నారు. అయితే అనుకోకుండా జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించటం ట్రీటెమెంట్ తీసుకోవటం జరిగింది.
అయితే ఈ విషయాన్ని బయిటకు లీక్ చేయవద్దని వరుణ్ సందేశ్ స్వయంగా కోరటం జరిగిందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రోజుల అనంతరం డాక్టర్స్ వద్దంటున్నా షూటింగ్ లో పాల్గొన్నాడని చెప్తున్నారు. మిగతా ఆర్టిస్టులు వేస్ట్ చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఇబ్బంది లేకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అలాగే దర్శకుడు సందీప్ గుణ్ణంని పిలిచి తనకి అలా జరగటంతో షూటింగ్ కి ఇబ్బంది ఎదురైందని సారి చెప్పాడని సమాచారం. మొత్తానికి అతను రియల్ హీరోలా బిహేవ్ చేసాడని దర్శక, నిర్మాతలు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











