వరుణ్ సందేశ్ హీరోగా 'బ్రహ్మిగాడి కథ'!?
మీ శ్రేయోభిలాషి దర్శకుడు ఈశ్వరరెడ్డి త్వరలో బ్రహ్మిగాడి కథ టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకక్కించనున్నారు. వరుణ్ సందేశ్, అస్మిత, పూనం కౌర్ కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మల్టి డైమన్షన్స్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం కీలకపాత్రలో కనిపించే ఈ చిత్రంలో కృష్ణుడు, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు చేయనున్నారు. యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రం కథ బ్రహ్మానందం పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది అని అందుకే బ్రహ్మిగాడి కథ అని టైటిల్ పెడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈశ్వరరెడ్డి..శ్రేయాభిలాషి తర్వాత ఛార్మి, శర్వానంద్ కాంబినేషన్ లో మనోరమ అనే ఫ్లాప్ చిత్రాన్ని రూపొందించారు.
వరుణ్ సందేశ్ అస్మిత పూనమ్ కౌర్ బ్రహ్మిగాడి కథ ఈశ్వరరెడ్డి varun sandesh brahmigadi katha poonam kaur eswar reddy


Click it and Unblock the Notifications