twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ క్రేజీ టైటిల్ 'కుర్రాడు'

    By Staff
    |

    Varun Sandesh
    హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేష్, నేహా శర్మ(చిరుత ఫేమ్)కాంబినేషన్ లో గుణ్ణం సందీప్ (గంగరాజు కుమారుడు)రూపొందిస్తున్న చిత్రానికి కుర్రాడు అనే టైటిల్ పెట్టే అవకాశాలున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా చేసిన 'పొల్లాదవాన్' సినిమా రీమేక్ ఇది. జెమెనీ ఫిల్మ్ సర్క్యూట్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథ ప్రభు అనే ఓ తెలివైన బద్దకస్దుడైన కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ స్నేహితులతో తిరిగే అతనికి ఓ బైక్ కొనుక్కోవాలనే తీరని కోరిక ఉంటుంది. అయితే నిజాయితీ పరుడైన తండ్రి సంపాదన ఆ అవకాశమివ్వదు.అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు.

    దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్ సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్లతో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది. ఇక ధనుష్ నటన చెప్పేదేముంది. 'కొత్త బంగారులోకం' హిట్ తో ఉన్న వరుణే్ ఎవియం వారి సినిమాలలోనూ హీరోగా చేస్తున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X