కాజల్ చెల్లితో వరుణ్ సందేశ్ ప్రేమ వ్యవహారం
గత కొద్దిరోజులుగా లవర్ బోయ్ వరుణ్ సందేశ్ కాజల్ అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అయితే అది నిజ జీవితంలో కాదు. నిషా అగర్వాల్ నీ హీరోయిన్ గా పరిచయం చేస్తూ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో కేశనపల్లి రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రానికి 'ఏమైంది ఈవేళ" కోసం. అలాగే రీసెంట్ గా ఈ చిత్రానికి 'ఏమైంది ఈవేళ" టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత కేశనపల్లి రాధా మోహన్ మాట్లాడుతూ-మా చిత్రానికి ఎన్నో పేర్లు పరిశీలించాం. చివరిలో ఏది మంచిదన్నట్లుగా ఓ నాలుగు టైటిల్స్ అందరితో చర్చించి చివరికి 'ఏమైంది ఈ వేళ" అనే పేరును ఖరారు చేశాం. ఈ చిత్రంలో కథ సరికొత్తగా ఉంటుంది. పాటలు మినహా టాకీపార్టు పూర్తయింది అని తెలిపారు. శశాంక్, నిశాషా, వెన్నెల కిశోర్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ఝాన్సీ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం చక్రి, కెమెరా: బుజ్జి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎడిటింగ్: ముత్యాల నాని, నిర్మాత: కేశనపల్లి రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.


Click it and Unblock the Notifications











