వరుణ్ తో దుర్గా ఆ ర్ట్స్
క్షణక్షణం, హలో బ్రదర్, సంతోషం వంటి సూపర్ హిట్ మూవీస్ ని అందించిన దర్గా ఆర్ట్స్ తాజాగా వరుణ్ సందేశ్ తో చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఎవరైనా ఎపుడైనా, హలో ప్రేమిస్తారా, ఓయ్ వంటి చిత్రాలకు రచన అందించిన రాజసింహ ఈ చిత్రంతో దర్శకుడుగా మారనున్నాడు.ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రం డబ్బింగ్ లో ఉన్నారు. కుర్రాడు చిత్రాన్ని ఆనందీ ఆర్ట్స్ వారు గుణ్ణం సందీప్ దర్శకత్వంలో చేస్తున్నారు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన పొల్లాదవాన్ రీమేక్ ఇది. ఈ చిత్రంలో వరుణ్ సరసన చిరుత ఫేమ్ నేహాశర్మ నటిస్తోంది. ఈ చిత్రం అనంతరం దిల్ రాజు నిర్మిస్తున్న మరో చరిత్ర రీమేక్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈ దుర్గా ఆర్ట్స్ చిత్రం ప్రారంభం కానుంది.
varun sandesh rajasinha oye kshanakshanam durga arts hello brother santosham వరుణ్ సందేశ్ రాజసింహ దుర్గా ఆర్ట్స్ సంతోషం హలో బ్రదర్ హ్యాపీడేస్ కుర్రాడు నేహాశర్మ


Click it and Unblock the Notifications