కాజల్ చెల్లితో వరుణ్ సందేశ్ రొమాన్స్ డిటేల్స్...
'హ్యాపీడేస్", 'కొత్త బంగారు లోకం" తర్వాత ఈ చిత్రం వరుణ్ సందేశ్‌కి మరో హిట్ సినిమా అవుతుంది అంటున్నారు నిర్మాత కేసనపల్లి రాధామోహన్ (అధినేత నిర్మాత). సంపత్ నంది అనే దర్శకుడుని పరిచయం చేస్తూ...వరుణ్ సందేశ్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్‌స పతాకంపై ఆయన ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ చిత్రం 70శాతం షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ వివరాలను మీడియాకు తెలియచేసారు. ఆయన మాటల్లోనే..'హైదరాబాద్ పరిసరాల్లో ఏకధాటిగా సాగిన చిత్రీకరణతో 70శాతం టాకీ పూర్తయింది. ఈనెల 15కి మొత్తం టాకీ పూర్తవుతుంది. ఆగస్టు 16నుంచి పాటల చిత్రీకరణ ఉంటుంది.మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే వాటిలోంచి ఒకటి ప్రకటిస్తాం. యువత, ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అలరించేలా విభిన్న కథాంశంతో చిత్రం రూపొందుతోంది" అన్నారు. అలాగే ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ద్వారా కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది.


Click it and Unblock the Notifications











