వరుణ్ సందేష్ కొత్త మూవీ ప్రారంభం

By Bojja Kumar

'ఏమైంది ఈ వేళ' చిత్రం ద్వారా హిట్ అందుకున్న వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ మరోసారి జతకట్టబోతున్నారు. పి భాను శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, కిరణ్ లు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ నివ్వగా , చంటి కెమెరా స్విచ్ ఆన్ చేసారు, బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ...దర్శకుడు భాను ఈ స్టోరి చెప్పిన వెంటనే నచ్చేసింది. పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రను నేనీ సినిమాలో చేస్తున్నాను. నిషాతో నాకిది రెండవ సినిమా. అల్ రెడీ ఒక సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. బాబా సెహగల్ ఆ పాటను పాడారు. రవి వర్మ చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్ చెబుతున్నాను అని అన్నారు. నిషా అగర్వాల్ మాట్లాడుతూ నాకెరీర్లో మరో మంచి పేరు తెచ్చే పాత్ర చేస్తున్నా, ప్రేక్షకుల మెప్పుపొందుతాననే నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ఈ కథకి హీరోగా వరుణ్ యాప్ట్. ఈ సినిమా తరువాత మా చిత్ర కథానాయిక నిషా సౌందర్య అంతటి పేరును గడిస్తుంది. మొదటి షెడ్యుల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం అవుతుంది అని అన్నారు. సుమన్, ఆలీ, డా. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్ , రావు రమేష్ , వేణు మాధవ్, జ్యోతి, సురేఖ వాణి, ముమైత్ ఖాన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:చంద్రబోస్ , శ్రీమణి, సురేంద్ర, ఎడిటింగ్ :కోటగిరి వెంకటేశ్వరరావు, ఫోటోగ్రఫి:శ్రీనివాస్.జి , సంగీతం: రవివర్మ, నిర్మాతలు: పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, కిరణ్, కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం:పి.భాను శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X