వరుణ్ సందేష్... ‘నువ్వలా.. నేనిలా’
సీమ టపాకాయ్, అవును చిత్రాల హీరోయిన్ పూర్ణ ఈ చిత్రంలో వరుణ్ సందేష్ సరసన హీరోయిన్‌గా ఎంపికయింది. ఫిబ్రవరి 13న రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుగనుంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగాల్సి ఉంది. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ భాగవతుల, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కెమెరా: శ్రీ, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీధర్ పాలకుర్తి, నిర్మాత: ఇందూరి రాజశేఖర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.
వరుణ్ సందేష్ ఈచిత్రాలతో పాటు 'చమ్మక్ చల్లో', 'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్', డి ఫర్ దోపిడీ తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. 'కోనేటి శ్రీను'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మణ్ కేదారి 'అబ్బాయి క్లాస్..అమ్మాయి మాస్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చమ్మక్ చల్లో చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో '99', 'షోర్ ఇన్ సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications












