హీరో వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ.. మాస్ లుక్.. పాత్రతో ‘దాడి’!
యువ హీరో వరుణ్ సందేశ్ కీలక పాత్రలో ఏ డి.జె.ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ఆర్ల నిర్మిస్తున్న చిత్రం దాడి. మధు శోభ.టి దర్శకుడు. ఈ చిత్రంలో జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి తదితరులు నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. శివాజీ రాజా క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో..

రీఎంట్రీపై హీరో వరుణ్ సందేశ్
దాడి సినిమాతో రీ ఎంట్రీపై హీరో వరుణ్ సందేశ్ స్పందించారు. ఏడాది పాటు అమెరికాలో ఉన్నాను. గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా కథలు విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ మధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని అన్నారు.

గోకుల్ ఛాట్ దాడి నేపథ్యంగా
నా గత సినిమాలకు భిన్నమైన ప్రయత్నమిది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఇందులో కనపడతాను. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాలు వెనుక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశాననేదే ఈ కథ. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్‌కెళతాం అని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.

అన్ని రకాల ఎమోషన్స్‌తో
డైరెక్టర్ మధు శోభ మాట్లాడుతూ - అన్నీ రకాల ఎమోషన్స్ ఉండే చిత్రమిది. యూత్‌కు మంచి సందేశం ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనుకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది. కచ్చితంగా హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది`` అన్నారు.

మంచి సందేశంతో దాడి
నిర్మాత శంకర్ ఆర్ల మాట్లాడుతూ - మంచి సందేశం ఉన్న చిత్రం. వరుణ్ సందేశ్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దర్శకుడు మధు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి నిర్మాతగా మారాను అన్నారు.కార్యక్రమంలో కారణ్య, చెరిష్మాజీవన్, శివశంకర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక వర్గ నిపుణులు
ఈ చిత్రానికి డాన్స్: శివశంకర్ మాస్టర్, సూర్య కిరణ్, ఆర్ట్: వెంకట్, డైలాగ్స్: గుత్తి మల్లిఖార్జున్, ఫైట్స్: శేఖర్, సంగీతం :మణిశర్మ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్ పుట్టగళ్ల, క్రియేటివ్ హెడ్: మోహన్, నిర్మాతలు: శంకర్ ఆర్ల, డైరెక్టర్: మధు శోభ.టి


Click it and Unblock the Notifications











