వరుణ్ సందేశ్ తో సంభధం ఒప్పుకుంది
శ్ర్దద్దాదాస్ కీ, వరుణ్ సందేశ్ కీ మధ్య గత కొంత కాలంగా రిలేషన్ నడుస్తున్న విషయం ఇండస్ట్రీలో తెలిసిందే. ఆమె కోసం వరుణ్ సందేశ్ రెగ్యులర్ గా ముంబై కూడా వెళ్లి వస్తూండేవాడు. అయితే తాజాగా బమ్మిగాడి కథ టైమ్ లో అస్మితా సూద్ తో అతను ఎఫైర్ పెట్టుకుని ఆమెను పట్టించుకోవటం మానేసాడు. దాంతో కాలిన శ్రద్దాదాస్ ఓ లీడింగ్ డైలీతో తన మనస్సులో బాధను చెప్పింది. తామిద్దరం దాదాపు మూడు నెలలు పాటు బాగా క్లోజ్ గా రిలేషన్ షిప్ లో ఉన్నామని కానీ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయామంది.
అలాగే అస్మితాసూద్ విషయానికి వస్తూ..ఈ పరిశ్రమలో ఇలాంటి రిలేషన్స్ మామూలే అన్నట్లు మాట్లాడింది. ఎంటర్నైమెంట్ ఇండస్ట్రీలో ప్రేమ అనేది ఉత్తిమాట అని తేల్చేసింది. అయితే విడిపోవటం తన అదృష్టమంది. తాను ముగ్గురు షూటింగ్ కోసం మలేషియాకి వెళ్లి అంతా మర్చిపోయానంది. ఇక వరుణ్ సందేశ్ డ్రగ్స్ తీసుకోవటం మ్యాటర్ పై మాట్లాడుతూ..నేను అతన్ని బాగా ఎరుగుదును..త్వరలోనే అతను క్లీన్ అనిపించుకుంటాడని చెప్పింది. ఇక వరుణ్ సందేశ్,శ్రద్దాదాస్ ఇద్దరూ కలిసి మరో చరిత్ర చిత్రంలో చేసారు.


Click it and Unblock the Notifications











