వరుణ్ సందేశ్ జీవితంతో బ్రహ్మానందం ఆడుకుంటాడా?
నిజజీవితంలో బ్రహ్మానందం వచ్చి వరుణ్ సందేశ్ లైఫ్ తో ఆడుకోవటం కాదు. వరుణ్ సందేశ్ తాజా చిత్రం 'బ్రమ్మిగాడి కథ' లో అలాంటి సీన్ ఉంటుందంటున్నారు దర్శకుడు ఈశ్వరరెడ్డి. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పరిచయమైన ఈశ్వరరెడ్డి తాజాగా రూపొందించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియచేస్తూ... ''బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు.
కానీ బ్రమ్మి వాక్కు బ్రహ్మ వాక్కును మించిపోయింది. బ్రమ్మి చెప్పిన ఓ కథ ఈ సినిమాని మలుపు తిప్పుతుంది. అందుకే 'బ్రమ్మిగాడి కథ' అని పేరు పెట్టాం. ఇంతకీ ఆ కథేంటి? అసలు బ్రమ్మి ఎవరు అనే సంగతి తెర మీదే చూడండి'' అంటున్నారు.
ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన అస్మితాసూద్ జంటగా నటించింది.. కృష్ణుడు, పూనమ్‌కౌర్ కీలక పాత్రల్లో కనిపించే ఈ చిత్రానికి. రజత్ పార్థసారధి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు


Click it and Unblock the Notifications











