'అలా మొదలైంది' తో పోలికా? అంత సీనుందా?
'అలా మొదలైంది' తర్వాత అంత మంచి రిపోర్ట్ వచ్చింది మా సినిమాకే అంటున్నారు.మంచి సినిమాని ఆదరిస్తామని మరోసారి వారు రుజువు చేశారు.అన్ని సెంటర్ల నుంచీ చాలా బాగుందనే రిపోర్ట్ వచ్చింది అంటున్నాడు దర్శకుడు వి.ఈశ్వర రెడ్డి. వరుణ్ సందేశ్ తాజా చిత్రం 'బ్రమ్మిగాడి కథ' రీసెంట్ గా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి సక్సెస్ మీట్ లలో దర్శకుడు వి. ఈశ్వర్‌రెడ్డి మాత్రం ఓ రేంజిలో చెప్పుకొస్తున్నాడు.ఆయన మాటల్లోనే.. చాలా రోజుల తర్వాత చిన్న సినిమాని పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులు. చూస్తున్నంతసేనూ వారు పడీ పడీ నవ్వుతున్నారు. ఇక ఇది విన్న వారు అంతలా నవ్వితే మౌత్ టాక్ స్పెడ్ అయ్యి వెళ్ళతారు కదా..దియోటర్స్ ఎందుకంత ఖాళీగా ఉంటున్నాయి అంటున్నారు.


Click it and Unblock the Notifications











