వరుణ్ సందేష్, నీలకంఠ ‘చమ్మక్ చల్లో’
రా.వన్ సినిమాలో 'చమ్మక్ చల్లో" సాంగ్ ఎంత పాపులారిటీ సంపాదించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఇలా పాపులర్ అయిన పాటల్లోని పదాలను సినిమా పేర్లుగా పెట్టుకున్న సందర్భాలు అనేకం. తాజాగా ఈ ఐడియా దర్శకుడు నీలకంఠకు వచ్చింది. వరుణ్ సందేశ్ హీరోగా తాను నిర్మించబోయే రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు 'చమ్మక్ చల్ల్లో" అనే పేరును ఖరారు చేశారు.
ప్రస్తుతం నీలకంఠతో పాటు, వరుణ్ సందేష్ కూడా ప్లాపుల బాటలో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రమోగాత్మక, మెసేజ్ ఫుల్ చిత్రాలకే పరిమితం అయిన నీలకంఠ ఈ సారి కమర్షియల్ గా ఆలోచించి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈ సినిమా ప్రాజెక్టు వీరికి ఏ మేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











