వరుణ్ సందేశ్ తాజా చిత్రం 'ఏమైంది ఈ వేళ' ఏమైంది?
వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్ లో ఈ శుక్రవారం విడుదలైన చిత్రం 'ఏమైంది ఈ వేళ'. ఈ చిత్రం టైటిల్ పరంగానూ యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నా దానికి తగ్గ రేంజిలో చిత్రం లేదనే టాక్ తెచ్చుకుంది. కాజల్ చెల్లెలు హీరోయిన్ గా పరిచయమైన ఈ చిత్రం ద్వారా సంపత్ నంది అనే రచయిత దర్శకుడుగా మారారు. కథ ప్రకారం....పెళ్ళయి విడిపోయిన జంట...శ్రీను (వరుణ్ సందేశ్), అవంతిక (నిషా అగర్వాల్). వాళ్ళిద్దరూ వేరు వేరుగా రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవడంతో కథ మొదలవుతుంది. శ్రీను పెళ్ళి చేసుకోవాలి అనుకునే నిమిషా తోనూ, అవంతిక తన కోసం చుసిన శశాంక్ తోనూ తమ గతాన్ని గుర్తుచేసుకుని చెబుతూంటారు.
శ్రీను వరంగల్ నుండి, అవంతిక బాపట్ల నుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వేటలో అమీర్ పేట్ వచ్చి చేరతారు. అన్ని సినిమాలలో లాగానే గొడవతో మొదలైన పరిచయం కాస్తా కొన్నాళ్ళకు స్నేహంగా..ఆ తర్వాత ప్రేమగా కన్వర్ట్ అవుతుంది. అంతేగాక వీరిద్దరూ శారీరకంగా కూడా దగ్గరై పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకుని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అయితే ఇద్దరి మధ్యనా ఇగో సమస్యతో మొదలైన చిన్న తగువులు పెద్దవై విడిపోతారు. విడాకులు తీసుకుని రెండో పెళ్ళికి సిద్దం అవుతారు. ఇక ఈ కథంతా విన్న వాళ్ళు ఆలోచనలో పడి ఓ నిర్ణయం తీసుకుంటారు. అదేంటి అన్నది మిగతా కథ.
యూత్ కి దగ్గరవటానికి కొన్ని చోట్ల కొంత చీప్ డైలాగ్స్ ని దర్శకుడు ఆశ్రయించటం కొంత ఇబ్బందిగా చెప్తున్నారు. అయితే వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం ఈ సినిమాలో టెక్కెట్టు డబ్బు గిట్టు బాటయ్యే అంశం. ఇక చక్రి పాటలు కూడా రెండు మాత్రమే బాగున్నాయి. ఇక ఈ సినిమాకి మరింత పబ్లిసిటీ చేస్తే ఉన్నంతలో నిలబడే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











