twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రం కధ ఇదే!

    By Srikanya
    |

    వరుణ్‌ సందేశ్‌, నేహాశర్మ కాంబినేషన్లో రెడీ అయిన 'కుర్రాడు' చిత్రం ఈ రోజే(గురువారం) రిలీజవుతోంది.తమిళంలో ధనుష్ చేసి హిట్ అయిన పొల్లాదవన్ కి రీమేక్ ఇది. ఇక ఈ చిత్రం కథలో హీరో(వరుణ్ సందేశ్) మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు.అతను తెలివైన బద్దకస్తుడు. అతినికి మూడే మూడు లక్ష్యాలుంటాయి. ఒకటి సొంతంగా ఓ బైక్‌ కొనుక్కోవడం. రెండు ఆ బైక్‌పై ప్రియురాల్ని ఎక్కించుకొని షికారు చేయడం. మూడు తండ్రిని బాగా చూసుకోవడం. అయితే నిజాయితీ పరుడైన తండ్రి(తణికెళ్ల భరణి) సంపాదన ఆ అవకాశమివ్వదు. అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు.

    దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్(బాకీ వసూళ్లు) సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్ల(నేహా శర్మ)తో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ (బొమ్మాళి రవి)తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది.

    ఇక దర్శకుడుగా గుణ్ణం సందీప్‌(గుణ్ణం గంగరాజు కుమారుడు)పరిచయమవుతున్న ఈ చిత్రంలో రీమిక్స్ చేసిన కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు పాట ఇప్పటికే పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిరుత తర్వాత నేహాశర్మ చేస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ చిత్రంలో బొమ్మాళి రవి, తనికెళ్ళ భరణి, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, వేణు, నవీన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఎడిటింగ్: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, ఫైట్స్‌: రాంబో రాజ్‌కుమార్‌ అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X