'కుదిరితే కప్పు కాఫీ'...అంటున్న వరుణ్ సందేశ్
'కుదిరితే కప్పు కాఫీ...వీలైతే నాలుగు మాటలు' బొమ్మరిల్లు చిత్రంతో పాపులర్ అయిన ఈ వాక్యాల టైటిల్ తో ఓ సినిమా రాబోతోంది. వరుణ్ సందేశ్ హీరోగా సాయికిరణ్ అడవి నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకోబోతోంది. 'విలేజ్ లో వినాయకుడు' అందించిన మూన్ వాటర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు చిత్రసీమకు పరిచయమవుతున్నారని సమాచారం. ఓ రొమాంటిక్ కామిడీగా ఈ చిత్రం రూపొందనున్నదని తెలుస్తోంది. హీరోయిన్ మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వరుణ్ సందేశ్ హ్యాపీ హ్యాపీగా...అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రియా శరణ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సరోజ చిత్రం లో చేసిన వేగ, శరణ్యా మోహన్ నటిస్తున్నారు.
వరుణ్ సందేశ్ విలేజ్ లో వినాయకుడు హ్యాపీ హ్యాపీగా కుదిరితే కప్పు కాఫీ varun sandesh village lo vinayakudu happy happy ga kudiritey kappu coffee


Click it and Unblock the Notifications