వరుణ్ సందేశ్, నేహాశర్మల 'కుర్రాడు' రిలీజ్ డేట్
వరుణ్ సందేశ్, నేహాశర్మ కాంబినేషన్లో రెడీ అయిన 'కుర్రాడు' చిత్రం నవంబర్ ఐదున రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గుణ్ణం సందీప్ మాట్లాడుతూ "ఇటీవల ఫైనల్‌మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తొలికాపీని సిద్ధం చేస్తున్నాం. నవంబరు 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అచ్చు సంగీతాన్ని సమకూర్చారు. అనంతశ్రీరామ్ మంచి సాహిత్యాన్ని అందించారు. పాటలకు మంచి స్పందన వస్తోంద''ని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. చిరుత తర్వాత నేహాశర్మ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఈ చిత్రంలో బొమ్మాళి రవి, తనికెళ్ళ భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణు, నవీన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: రాంబో రాజ్‌కుమార్ అందిస్తున్నారు.
ధనుష్ హీరోగా చేసిన పొల్లాదవాన్ సినిమాలో కథ ప్రభు అనే ఓ తెలివైన బద్దకస్దుడైన కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ స్నేహితులతో తిరిగే అతనికి ఓ బైక్ కొనుక్కోవాలనే తీరని కోరిక ఉంటుంది. అయితే నిజాయితీ పరుడైన తండ్రి సంపాదన ఆ అవకాశమివ్వదు.అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు. దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్ సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్లతో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది.మరి తెలుగులో ఏం మార్పులు చేసారో చూడాలి.


Click it and Unblock the Notifications











