తమిళ రీమేక్ లో వరుణ్ సందేశ్...

అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు. దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్ సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్లతో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది. ఇక ధనుష్ నటన చెప్పేదేముంది. వరుణ్ సంధేశ్ ఈ సినిమా కాన్సెప్టుని ఆకలింపు చేసుకుని నటిస్తేనే వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతం వరుణ్ 'కొత్త బంగారులోకం',ఎవియం వారి సినిమాలలో హీరోగా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











