వీర్య దాతగా మారనున్న వరుణ్ సందేష్!
తద్వారా వచ్చే డబ్బుతో ప్యాకెట్ మనీ కింద ఉపయోగించుకోవడం మొదలు పెట్టి రాను రాను దాన్నే తన వృత్తిగా చేసుకుంటాడు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈచిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. వీర్యం అనగానే ఇదో బూతు సినిమా అనుకున్నారు కానీ ఆతర్వాత అది మామూలు సినిమా అని తేలడం, మంచి సబ్జెక్టు కావడంతో ఆదరణ బాగానే లభించింది.
తాజాగా ఈచిత్రాన్ని తెలుగులో మధుర శ్రీధర్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.... ఇదొక మంచి సబ్జెక్టు. ఈ తరానికి నచ్చే సినిమా. అయితే నేను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగండి. ఇప్పుడు నేనే వేరే సినిమాతో బిజీగా ఉన్నాను అని వెల్లడించారు.
సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి మధుర శ్రీధర్ ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రకు తెలుగు హీరో వరుణ్ సందేష్‌ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












