సైలెంట్ గా వరుణ్ సందేశ్ స్టార్ట్ చేసాడు
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం చిత్రాలతో పాపులయిన వరుణ్ సందేశ్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచి సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించాడు. విష్ణు వర్ధన్ (తమిళ భిల్లా డైరక్టర్) దగ్గర అసెస్టెంట్ గా పనిచేసిన శరవణ్ అనే తమిళ డైరక్టర్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. తమిళ, తెలుగు బాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శరణ్య(విలేజ్ లో వినాయకుడు ఫేమ్) చేస్తోంది. అలాగే సరోజ చిత్రంలో చేసిన వేగ కూడా మరో హీరోయిన్ గా ఇందులో పలకరించనుంది. ఇక ఈ చిత్రాన్ని దుర్గాప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తూండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సిరివెన్నెల సాహిత్యం అందిస్తున్నాడు. మరో ప్రక్క వరుణ్ సందేశ్ దిల్ రాజుతో చేస్తున్న మరో చరిత్ర రీమేక్ పూర్తి కావస్తోంది. అలాగే త్వరలో తమిళ పొల్లాదవాన్ రీమేక్ కుర్రాడు రిలీజ్ అవుతోంది.
వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ కొత్తబంగారు లోకం ఎవరైనా ఎపుడైనా మరో చరిత్ర కుర్రాడు శరణ్య విలేజ్ లో వినాయకుడు మణిశర్మ varun sadesh saranya village lo vinayakudu vega saroja saravan


Click it and Unblock the Notifications