అఫీషియల్ : వరుణ్ తేజ్ నెక్ట్స్ కు డైరక్టర్ ఖరారు

By Srikanya

హైదరాబాద్ :"నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంది. రాజీవ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారు. సమాజంలో సంఘటనలే నా సినిమాలకు స్ఫూర్తి. అలా ఈమధ్య నాలో ఆలోచనలు రేకెత్తించిన సందర్భమే....వరుణ్‌తేజ్‌తో చేయబోతున్న సినిమా. నాలోనే కాదు, అందరిలోనూ ఆలోచన రేకెత్తించే సినిమా అవుతుంది అన్నారు దర్శకుడు క్రిష్.

ముకుందా చిత్రంతో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి...విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ మెగా హీరో నెక్ట్స్ చిత్రం ఏ దర్శకుడుతో చేయబోసతున్నారనేది అందరికీ ఆసక్తే. అయితే తదుపరి చెయ్యబోయే చిత్రానికి దర్శకుడు ఖరారు అయినట్లే అని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు క్రిష్. ఈ విషయాన్ని ఆయనే ఇలా ఖరారు చేసి తెలిపారు.

'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్‌'...వంటి విభ క్రిష్‌ తెలుగు వారికి మరింన్నమైన కథలతో తెలుగు వారికి బాగా దగ్గరైపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో 'గబ్బర్‌' చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగులో వచ్చిన 'ఠాగూర్‌'కి ఇది రీమేక్‌.

Varun Tej 2nd Movie with Director Krish

క్రిష్ ..గబ్బర్ గురించి మాట్లాడుతూ... 'గమ్యం' చూసిన తరవాత సంజయ్‌లీలా బన్సాలీ ముంబై పిలిపించారు. ఆ సినిమాను హిందీలో తెరకెక్కించమన్నారు. అయితే అక్షయ్‌ కుమార్‌ డేట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందుకే ముందు 'ఠాగూర్‌' రీమేక్‌ బాధ్యత అప్పగించారు. 'ఠాగూర్‌' ఓ గొప్ప కథ. ఆ రూపంలో నాకో తాడు దొరికింది. దానికి నాకిష్టమైన పూలు పేర్చుకొంటూ వెళ్లొచ్చనిపించింది. పైగా హిందీ సినిమా అంటే.. మార్కెట్‌ స్థాయి వేరుగా ఉంటుంది. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా అంగీకరించా అన్నారు.

అలాగే.. 'ఠాగూర్‌' వచ్చి దాదాపు దశాబ్దకాలమైంది. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి. ఆలోచనలు మారాయి. అందుకే ఈ కథలో మార్పులు చేసే అవకాశం దక్కింది. దాదాపు 60 శాతం కొత్త అంశాల్ని తీసుకొన్నాం. 'ఠాగూర్‌' చూసిన వాళ్లకూ 'గబ్బర్‌' కొత్తగా అనిపిస్తుంది. నా సినిమా అనగానే మానవ సంబంధాల్ని స్పృశిస్తానన్న నమ్మకం ఉంటుంది. 'ఠాగూర్‌'లోని ఆసుపత్రి సన్నివేశం అందుకు అవకాశం కల్పించింది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X