For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నాన్నకు కోపం వచ్చింది: నాగబాబు-బాలయ్య వివాదంపై వరుణ్ తేజ్!

    |

    బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ ఈ మధ్య కాలంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యను పట్టుకుని నాగబాబు అంత మాట అనేశారేంటి? ఇలా అని ఉండకూడదు అని కొందరు అంటుండగా... బాలయ్య ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు ఇది తగిన సమాధానం అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

    తాజాగా 'అంతరిక్షం' మూవీ ప్రమోషన్లలో ఉన్న వరుణ్ తేజ్‌కు ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తన సినిమాలు, తన వర్క్ ఏంటో తప్ప ఇలాంటి వివాదాలను పట్టించుకోని వరుణ్ తేజ్ దీనిపై ఏమన్నారో చూద్దాం....

    నాన్న పర్సనల్ లైఫ్ గురించిన విషయాల్లో వేలు పెట్టను

    నాన్న పర్సనల్ లైఫ్ గురించిన విషయాల్లో వేలు పెట్టను

    నాగబాబు బాలకృష్ణ కాంట్రవర్సీపై వరుణ్ తేజ్ స్పందించారు. ఎందుకలా మాట్లాడారని ఎప్పుడైనా మీ నాన్నను అడిగారా? అనే ప్రశ్నకు వరుణ్ తేజ్ రియాక్ట్ అవుతూ... మా నాన్న పర్సనల్ లైఫ్ గురించిన విషయాలపై నేను ఎప్పుడూ క్వశ్చన్ వేయను. ఆయన పొలిటికల్‌గా ఏదో రైట్ అనుకున్నారు, అనేశారు... అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

    దీని వల్ల నాకేం ఇబ్బంది లేదు

    దీని వల్ల నాకేం ఇబ్బంది లేదు

    ఇండస్ట్రీలో ఉంటూ మీ నాన్న ఇలా మాట్లాడటం వల్ల, మీరు కూడా ఒక యాక్టర్ అవ్వడం వల్ల ఎమైనా ఇబ్బంది పడ్డారా?. అంటే... అలాంటి దేమీ లేదు అని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.

    మా నాన్నకు రైట్ అనిపిస్తే చేస్తాడు

    మా నాన్నకు రైట్ అనిపిస్తే చేస్తాడు

    మా నాన్నకు రైట్ అనిపించకుంటే ఏదీ చేయడు. రైట్ అనిపిస్తేనే చేస్తాడు. ఆయన ఏం చేసినా ఓ కారణం ఉంటుంది. నన్ను ఈ క్వశ్చన్ అడిగి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.

    ఆయన అన్నారు కాబట్టే నాన్న ఇలా అన్నారు

    ఆయన అన్నారు కాబట్టే నాన్న ఇలా అన్నారు

    రాజకీయాల్లో వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకరిని ఒకరు మాట అనుకోవడం మామూలే. ఆయన(బాలయ్య) కూడా కళ్యాణ్ బాబాయ్ ఎవరో తెలియదు అనడం నేను చూశాను. ఈ విషయం మా నాన్నను అడిగితే ‘‘ఆయన అలా అన్నపుడు నేను ఇలా అనడంలో తప్పేంటి?'' అన్నారని వరుణ్ తేజ్ చెప్పారు.

     తమ్ముడి అంటే కోపం రాదా?

    తమ్ముడి అంటే కోపం రాదా?

    నాన్న ఒకటే చెప్పారు. మా తమ్ముడిని ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది, ఒక అన్నగా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. మీకు నచ్చినా నచ్చక పోయినా కూర్చో అన్నారు. నేను సైలెంటుగా నోరు మూసుకుని కూర్చున్నాను.

    సైలెంటుగా ఉన్నంత మాత్రాన అలా అనుకోవద్దు

    సైలెంటుగా ఉన్నంత మాత్రాన అలా అనుకోవద్దు

    ఇలాంటి విషయాలు వచ్చినపుడు ఒకరు రియాక్ట్ అవుతారు, ఒకరు సైలెంటుగా ఉంటారు. సైలెంటుగా ఉన్నంత మాత్రాన మాకు ఇష్టమైందని కాదు. నాకు కూడా ఆ విషయం నచ్చలేదు. కొన్ని సార్లు బయట అందరూ మాట్లాడతారు కదా అని వదిలేస్తాం. కానీ మా డాడీ డిఫరెంట్. ఆయన తప్పకుండా రియాక్ట్ అవుతారు.... అని వరుణ్ తేజ్ తేల్చి చెప్పారు.

    English summary
    Varun Tej Supports Naga Babu's Comment On Bala Krishna. fewdays back Naga Babu got brutally trolled for saying that he doesn't know who Balakrishna is. This remark has caused a stir between Balayya and Chiranjeevi's fans on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X