పవన్ బాబాయ్ తిట్టడం వల్లే...అంటున్న వరుణ్ తేజ్

By Bojja Kumar

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నిన్న విడుదలైన ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సినిమా యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కుర్రాడిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే సత్తా ఉందని పలువురు ప్రశంసించారు.

తాజాగా వరుణ్ తేజ్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. పవన్ బాబాయ్ తిట్టిన విషయాన్ని బయట పెట్టాడు. ఆయన తిట్టడం వల్లే తాను ఇంతటివాడిని అయ్యానని తెలిపాడు. ఒక రోజు నన్ను, సాయి ధరమ్ తేజ్ ను బాబాయ్ పిలిచారు. భవిష్యత్ గురించి ఏమైనా ఆలోచించారా? లేదా? అని మందలించారు. ఫుల్ క్లారిటీతో నా వద్దకు రావాలని సూచించారు. ఆయన వల్లే తాము ఇపుడు ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. పెదనాన్న చిరంజీవి వద్ద క్షమశిక్షణ నేర్చుకున్నట్లు వరుణ్ తేజ్ తెలిపారు. సినీ పరిశ్రమలో ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు తెలిపారు.

Varun Tej about Pawan Kalyan

‘ముకుంద' సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X