అంతరిక్షంలో మెగా హీరోతో అదితి.. నక్షత్రాలతో డాన్స్!
Recommended Video

వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.వరుణ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. వరుణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది. ఘాజి చిత్రంతో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలో ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లోని ఓ పిక్ ని అదితి రావు సోషల్ మీడియాలో పంచుకుంది.

అంతరిక్షంలో జంట
ఈ చిత్రం కోసం అంతరిక్షానికి సంబందించిన భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సెట్ లో వరుణ్ తో తాను కలసి ఉన్న పిక్ ని అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నక్షత్రాలతో డాన్స్
ఈ సందర్భంగా ఓ ఉత్సాహభరితమైన కామెంట్ కూడా అదితి పోస్ట్ చేసింది. చంద్రుడిని ఛేజ్ చేస్తాం, నక్షత్రాలతో డాన్స్ చేస్తాం అంటూ అదితి పేర్కొంది. ఈ పిక్ లో వరుణ్ తేజ్, అదితి వ్యోమగాములు గెటప్ లో కనిపిస్తున్నారు.

అంతరిక్షంలో మ్యాజిక్
సబ్ మెరైన్ యుద్ధం అంటూ ఘాజి చిత్రంతో మాయ చేసిన సంకల్ప్ రెడ్డి ఈ సారి అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి అంతరిక్షం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ చిత్రాల తరువాత
రెండు రొమాంటిక్ చిత్రాలతో హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ ఈ చిత్రంతో ప్రయోగాల బాట పట్టాడు. ఈ చిత్రం పట్ల వరుణ్ తేజ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











