25 వేల బీర్ బాటిల్స్‌తో.. వరుణ్ తేజ్ భరిస్తాడేమో, 48 కేజీలే ఉన్న నా పరిస్థితి ఏంటి!
Recommended Video

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం అంతరిక్షం. లావణ్య త్రిపాఠి, రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. వరుణ్ తేజ్, అదితి రావు వ్యోమగాములుగా నటించారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేయసిగా నటించింది. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కిన అంతరిక్షం చిత్రం డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. టాలీవుడ్ లో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్ చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్, అదితి, లావణ్య త్రిపాఠి సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

రోజంతా గాల్లోనే ఉండాలి
వరుణ్ తేజ్ అంతరిక్షం చిత్ర షూటింగ్ గురించి వివరిస్తూ.. జీరో గ్రావిటీలో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా కష్టంగా అనిపించిందని వరుణ్ తెలిపాడు. రోజు మొత్తం గాల్లో వేలాడుతూనే ఉండాలి. ఒక రోజుకు 5 షాట్స్ మాత్రమే చిత్రికరించగలిగేవాళ్ళం. దీనితో శరీరానికి చాలా ఇబ్బందిగా అనిపించేది అని వరుణ్ తెలిపారు. ఇలాంటి చిత్రం తెలుగులో ఇంతవరకు రాలేదు. అందువల్ల షూటింగ్ కు ముందు చాలా హోమ్ వర్క్ చేశాం అని వరుణ్ తెలిపాడు.

కథ చెప్పకముందే
నాకు సంకల్ప్ ఈ కథ చెప్పక ముందే కొన్ని విజువల్స్ సిద్ధం చేసుకుని ఉన్నాడు. కథ వివరించేసాయంలో ఆ విజువల్స్ చూపించాడు. దీనితో కథ సులభంగా అర్థం అయింది. అప్పటికే నా స్నేహితుడు రాజీవ్, క్రిష్ ఇద్దరికీ విజువల్స్ పై మంచి పట్టు ఉంది. క్రిష్ కంచె నుంచి విజువల్స్ ఉండే చిత్రాలే చేస్తున్నాడు. అంతరిక్షం లాంటి సినిమాకు ఇలాంటి వాళ్ళు నిర్మాతలు అయితేనే బావుంటుందని భావించినట్లు వరుణ్ తెలిపాడు.

శాటిలైట్ సెట్
ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మౌనిక దంపతులు అప్పటికే రంగస్థలం చిత్రంతో అద్భుతం చేశారు. ఈ చిత్రానికి వాళ్ళైతేనే బావుంటుందని క్రిష్ చెప్పడంతో వారినే ఎంపిక చేసుకున్నాము అని వరుణ్ తెలిపాడు. శాటిలైట్ సెట్ ని, స్పేస్ క్రాఫ్ట్ సెట్ ని మతి పోయే విధంగా వేశారు. వాళ్ళు వేసిన సెట్ లో అంతరిక్షం ఎఫెక్ట్ కనిపిస్తుందని వరుణ్ తెలిపాడు.

25వేల బీర్ బాటిల్స్‌తో
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. 25 వేల బీర్ బాటిల్స్ తో మరో సెట్ వేశారు. అది నిజంగా అద్భుతం అని లావణ్య తెలిపింది. తెలుగు సినిమాని కొత్త పంథాలో నడిపించే ఇలాంటి చిత్రంలో నటించడం అదృష్టం అని పేర్కొంది. ఈ చిత్రంలో వ్యోమగాములుగా తాము ధరించిన సూట్ గురించి వరుణ్,అదితి ఆసక్తికర విషయాలు తెలియజేసారు. ఇండియా నుంచి శాటిలైట్స్ పంపుతున్నాం కానీ మనుషులు ఇంతవరకు వెళ్ళలేదు. ఈ విషయంలో మనకు అమెరికా లాంటి దేశాలే రిఫరెన్స్ అని వరుణ్ తెలిపాడు.

వరుణ్ భరిస్తాడేమో
అదితి రావు మాట్లాడుతూ.. వ్యోమగాములుగా మేము ఈ చిత్రంలో 15 కేజీల బరువు ఉండే సూట్ ధరించాం. అలాంటి సూట్ ని వరుణ్ తేజ్ భరిస్తాడేమో.. కానీ 48 కేజీల బరువు ఉన్న నేను అలాంటి సూట్ తో ఎంత ఇబ్బంది పడి ఉంటానో అర్థం చేసుకోండి అని అదితిరావు తెలిపింది. ఈ చిత్రంలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా పాటలు పెట్టడం కుదరదు అని వరుణ్ తెలిపాడు. కొత్త అనుభూతి ఆశించి అభిమానులు ఈ చిత్రానికి రావాలని వరుణ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











