‘నాగార్జున’తరుపున మెగా ప్రిన్స్.. అందులోనూ వరుణ్ దూకుడుగానే
మెగా హీరోల్లో ప్రత్యేకతను ఏర్పరుచుకున్నవాడు. ఇమేజ్‌కు దూరంగా, మాస్ జపాన్ని మంత్రించకుండా ఉన్నాడు వరుణ్ తేజ్. కెరీర్ ప్రారంభం నుంచి కొత్తదనం కోసం పరితపిస్తూనే ఉన్నాడు. చేసే ప్రతీసినిమాలో విభిన్నంగా కనిపించాలని శ్రమిస్తుంటాడు. సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటాడు. తొలిప్రేమ, ఫిదా, ఎఫ్2, గద్దలకొండ గణేష్ వంటి వరుస హిట్లతో వరుణ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు.
'గద్దలకొండ గణేష్' వరుణ్ తేజ్‌ను మాస్‌కు మరింత దగ్గర చేసింది. చేసింది విలన్ రోల్ అయినా.. తనదైన శైలిలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ మద్య సినిమాలతో కాకుండా ప్రకటనలతోనూ బాగానే సంపాదిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ మధ్య పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దుస్తులు, శీతల పానీయాలు వంటి ఉత్పత్తులకు తన ఇమేజ్‌ను తోడు చేశాడు.

తాజాగా నాగార్జున సిమెంట్స్‌కు సైతం తన క్రేజ్‌ను అరువిచ్చాడు. ఈ మేరకు నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. నాగార్జున సిమెంట్స్‌కి సంబంధించిన శీర్షిక(మీ అనుంబంధమే మా బలం, ప్రతి సౌధంలో మొనగాడై నిలిచి)తో ఈ పోస్టర్స్‌ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పోస్టర్లలో వరుణ్ రాయల్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ ఇంట్లోనూ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











