అల్లు అరవింద్ కోరినట్లే లావణ్య త్రిపాఠి పెళ్లి.. అప్పటి నుంచే వరుణ్ తో ప్రేమ!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త జంట హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు వారి మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న సమయంలోనే హఠాత్తుగా ఎంగేజ్మెంట్ వేడుకతో ఆశ్చర్యాన్ని కలిగించారు.

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ పై అధికారికంగా క్లారిటీ రావడంతో ఇప్పుడు వీరి గురించి అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో అల్లుఅరవింద్ మాట్లాడిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్యలో ఎప్పుడు ప్రేమ మొదలైంది అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

Varun tej and lavanya tripathi love story and allu aravind old comments viral

ప్రతి ఈవెంట్లో కూడా పాల్గొంటూ: చూడముచ్చటైన జంటగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలైతే ఎంతో కాలంగా వీరి గురించి అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కానీ ఆ తర్వాత వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే అనే విధంగా కూడా కామెంట్స్ అయితే వినిపించాయి. కానీ లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఈవెంట్లో కూడా పాల్గొంటూ ఉండడంతో ఆమెకు వరుణ్ తేజ్ మధ్యలో ప్రేమ ఉంది అని త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది అనే విధంగా పలు రకాల కథనాలు అయితే వెలువడ్డాయి.

Varun tej and lavanya tripathi love story and allu aravind old comments viral

చాలా కాలంగా పెళ్లి వార్తలు: అంతేకాకుండా ఆ మధ్యలో నాగబాబు కూడా వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఒక కామెంట్ చేశారు. ముఖ్యంగా నిహారిక పెళ్లి జరిగిన ఏడాది తర్వాతనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరుగుతుంది అని ఆయన అప్పట్లో చెప్పారు. దీంతో లావణ్య త్రిపాఠి తో అతనితో ఫిక్స్ అయిపోయింది అన్నట్లుగా అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. నిజానికి లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ప్రేమ ఈ మధ్యకాలంలో మొదలైంది కాదు.

Varun tej and lavanya tripathi love story and allu aravind old comments viral

అప్పటి నుంచి ప్రేమ: వారి కలయికలో వచ్చిన మొదటి సినిమా కంటే ముందు నుంచే వీరి ట్రాక్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. 2017లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ మిస్టర్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కంటే ముందుగానే అంటే 2016లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్య పరిచయం మొదలయింది.

ఇక తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకోవాలని తొందరగానే డిసైడ్ అయ్యారు. ఇక వరుణ్ తేజ్ మాత్రం కెరియర్ గురించి ఆలోచించి కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది లావణ్య త్రిపాఠి కూడా తమ మధ్యలో ప్రేమ 2016లోనే మొదలైంది అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక హింట్ అయితే ఇచ్చింది.

అల్లు అరవింద్ మాట నిజమైంది: ఇక లావణ్య త్రిపాఠి అల్లు అరవింద్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. 2021లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో లావణ్య త్రిపాఠి చావు కబురు చల్లగా.. అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో ఆమె గురించి మాట్లాడిన అల్లు అరవింద్..

తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చుగా.. అని సలహా ఇచ్చారు. ఇక అలా సరదాగా అల్లు అరవింద్ చెప్పిన మాట ఇప్పుడు నిజంగా మారిపోయింది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఆమె కోడలిగా చేరిపోతుంది. మరి ఈ విషయంపై లావణ్య వరుణ్ తేజ్ అలాగే అల్లు అరవింద్ భవిష్యత్తులో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X