వరుణ్ తేజ్ సాహసం..మెగాస్టార్, పవర్ స్టార్‌కు సాధ్యం కానిదానిపై గురి..!

By Staff

Recommended Video

Mega Hero's clashes, Allu Arjun takes lead

ఫిదా చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తొలిప్రేమ. వరుణ్ ఎంచుకుంటున్న కథల్ని గమనిస్తే సాహసం చేస్తున్నాడని అనిపించక మానదు. సాధారణంగా మెగా ఫ్యామిలీకి మాస్ ఆడియన్స్ లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మెగా ఫ్యామిలి లో లవర్ బాయ్ ఇమేజ్ ఏ హీరోకి కూడా లేదు. మాస్ ఆడియన్స్ లో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ వరుణ్ మాత్రం లవర్ బాయ్ ఇమేజ్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది.

చిరు, పవన్ లకు సాధ్యం కాలేదు

చిరు, పవన్ లకు సాధ్యం కాలేదు

మెగా ఫ్యాన్ బేస్ కు బీజం వేసిన చిరంజీవి, ఆ ఫాన్స్ ని మరో లెవల్ కు పెంచిన పవన్ కళ్యాణ్ లు కూడా ఎప్పుడూ లవర్ బాయ్ వేషాలు వేయలేదు. మాస్ ని మెప్పించే విధంగా మాత్రమే వీరి చిత్రాలు ఉండేవి.

రాంచరణ్, బన్నీ లది కూడా అదే దారి

రాంచరణ్, బన్నీ లది కూడా అదే దారి

మెగాస్టార్, పవర్ స్టార్ చరిష్మాని కమిటీన్యూ చేస్తూ రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా మాస్ ఆడియన్స్ లోని ఫాన్స్ ని ఏర్పరుచుకున్నారు. రామ్ చరణ్ లవర్ బాయ్ గా చేసిన ఆరెంజ్ చిత్రం బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. బన్నీ కూడా మొదట్లో ఆర్య వంటి లవ్ ఎంటర్ టైనర్ లని చేసినా ఆ తరువాత మాస్ కథల పైనే ద్రుష్టి పెట్టాడు.

ఆ ప్రయత్నం చేస్తున్న ఏకైక మెగా హీరో

ఆ ప్రయత్నం చేస్తున్న ఏకైక మెగా హీరో

వరుణ్ తేజ్ ఫిదా చిత్రం రొమాంటిక్ ప్రియులని మరో లోకం లోకి తీసుకుని వెళ్ళింది. తాజగా వరుణ్ నటించిన తొలి ప్రేమ కూడా మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. మెగా హీరోలంతా మాస్ కథల వెంట పడుతుంటే వరుణ్ మాత్రం భిన్నంగా ప్రేమ కథలని ఎంచుకుంటున్నాడు. అందులో తొలి అడుగు సఫలమైనా, భవిష్యత్తులో వరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ ఏ రేంజ్ కు చేరుకుంటుందో చూడాలి.

 ఫిబ్రవరి 10న రిలీజ్

ఫిబ్రవరి 10న రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్రం ఫిబ్రవరి 10 పేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ సరసన రాశీఖన్నా నటించింది. ఈ చిత్రంతో వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు. ఈచిత్రాన్ని ఎస్ వి సి సి బ్యానర్లో బి వి ఎస్ న్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X