నిహారిక, వరుణ్ తేజ్ చిన్నతనంలో ఎంత క్యూట్‌గా ఉన్నారో (ఫోటోస్)
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు వరుణ్ తేజ్. జనవరి 19తో ఈ మెగా హీరో 28వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గారాల చెల్లి నిహారిక సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్ అయింది.

వరుణ్-నిహారిక క్యూట్ లుక్
‘నా ‘గార్డియన్ ఏంజెల్స్' పుట్టినరోజు నేడు. లవ్యూ వరుణ్ అన్నయ్యా.. నువ్వు నా బంగారం. నీకు అన్ని విషయాల్లో ది బెస్ట్ లభించాలని కోరుకుంటున్నా.' అంటూ ఈ చిన్ననాటి ఫోటోను పోస్టు చేశారు నిహారిక.
Recommended Video


అజ్ఞాతవాసి సీన్ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
ఈ ఫోటోలో ఇద్దరూ సైకిల్ ఎక్కి కనిపించడంతో... మెగా అభిమానులంతా ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి' సైకిల్ సీన్ గుర్తు చేసుకుంటున్నారు.
చాలా మారిపోయావ్
అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావ్ అని గుర్తు చేస్తూ.... సాయి ధరమ్ తేజ్ ఓ పోస్టు చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

వరుణ్ తేజ్
‘ముకుంద' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన 5 సినిమాల్లో నటించారు. ప్రతి సినిమాలోనూ తనను తాను డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసుకున్నాడు.

తొలిప్రేమ
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ' సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి రాశీఖన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











