Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ లగ్జరీ లైఫ్‌లోకి నాగబాబు ఫ్యామిలీ, కష్టాలు క్లియర్....బెంజ్ కొన్న వరుణ్!
Recommended Video
మెగా బ్రదర్ నాగబాబు గతంలో 'అంజని ప్రొడక్షన్స్' బేనర్లో నిర్మాతగా సినిమాలు చేసేవాడు. అయితే ఆ మధ్య ఆయన నిర్మించిన 'ఆరెంజ్' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఫలితాలతో నాగబాబు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా చేశారు. అయితే ఆయన ఎలాంటి అఘాయిత్యం చేసుకోకండా ఈ రోజు మన ముందుకు ఉన్నారంటే కారణం అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్టుగా ఉండటమే.
బెల్లితెరను నమ్ముకున్న నాగబాబు
వెండితెర తనకు నిర్మాతగా నష్టాలు మిగల్చడంతో నాగబాబు బుల్లితెరను నమ్ముకున్నాడు. ఇక్కడ జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించడంతో పాటు, కొన్ని టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు.
కష్టపడి అప్పులు క్లియర్ చేసిన నాగబాబు
కొన్ని సంవత్సరాల పాటు అలుపు లేకుండా కష్టపడిన నాగబాబు ప్రస్తుతం అప్పులన్నీ తీర్చేసి....మళ్లీ ప్రాఫిట్ జోన్లోకి వచ్చేశారు. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య' అనే చిత్రానికి సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన మళ్లీ నిర్మాతగా ఎంటరయ్యే అవకాశం ఉంది.
ఒకానొక సమయంలో అత్యంత దుర్భరమైన స్థితి
ఒకానొక సమయంలో అంజనా ప్రొడక్షన్స్ బేనర్లో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే స్థాయి నుండి...... ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితికి పడిపోయారు నాగబాబు. అవి తన జీవితంలో అత్యంత దుర్భరమైన రోజులని.... తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న సందర్భమని... ఆ సమయంలో లక్ష రూపాయల అద్దె ఇంటి నుంచి రూ. 20 వేల అద్దె ఇంటికి మారిపోయానని, అప్పుడు తన పరిస్థితి ఇలా మారిపోయిందేంటా? అని తనపై తానే జాలిపడేవాడినని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించాను, బ్రతికేందుకు కారణాలు కనిపించలేదు, కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయాను అని నాగబాబు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
మళ్లీ లగ్జరీ లైఫ్ లోకి
ఒకప్పుడు అన్నేసి కష్టాలు పడిన నాగబాబు కుటుంబానికి కాలం కలిసి రావడం, పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ లగ్జరీ లైఫ్ జోన్లోకి వచ్చేశారు. కోట్ల ఖరీదు చేసే విలాసవంతమైన కార్లు కొనే స్థాయికి చేరుకున్నారు.
కోటి 30 లక్షల కారు కొన్న వరుణ్ తేజ్
వరుస సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ కూడా కుటుంబ ఆర్థిక కష్టాలు తీర్చడానికి తనవంతు సహాయం చేశాడని తెలుస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబును, తల్లి పద్మజను తీసుకెళ్ళి.. హైదరాబాదులోని బెంజ్ షోరూమ్ నుండి ఈ 1 కోటి 30 లక్షల రూపాయల కారు(Mercedes Benz GL 350) ను డెలివరీ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో ఇదే మోడల్ కారు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాడుతున్నారు.
కూతురు కూడా కష్టపడుతోంది
మరో వైపు నాగ బాబు కూతురు నిహారిక కూడా సినిమా రంగంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అమ్మడు ఖరీదైన ఆడి కారు కొనుగోలు చేసింది. వీటిని బట్టి నాగబాబు ఫ్యామిలీ కష్టాలు తీరి మళ్లీ లగ్జరీలైఫ్లోకి ఎంటరయ్యారని అర్థం చేసుకోవచ్చు.
వరుణ్ తేజ్ సక్సెస్
మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ క్రమ క్రమంగా సక్సెస్ బాట పడుతున్నాడు. ఈ ఏడాది వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వరుణ్ అంతకు ముందు చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాలే అందుకున్నాయి.
‘తొలిప్రేమ'తో
వరుణ్ తేజ్ త్వరలో తొలిప్రేమ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాశి ఖన్నా హీరోయిన్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం హిట్టయితే వరుణ్ తేజ్ స్టార్ స్టేటస్ మరింత పెరిగే అవకాశం ఉంది.