రష్మిక మందన్నపై మెగా హీరో కామెంట్.. ఆమె నడుము వీడియో చూసిన వెంటనే!
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో రష్మిక మందన్న టైమ్ నడుస్తోంది. ఆమె చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ కావడమే గాక ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న చేస్తున్న తాజా సినిమా 'భీష్మ'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ వీడియో ద్వారా ఇటు రష్మిక అభిమానులకు, అటు నితిన్ అభిమానులకు రొమాంటిక్ ట్రీట్ ఇచ్చారు. రష్మిక నడుము చూసి పరేషాన్ అవుతున్న నితిన్.. చివరకు తట్టుకోలేక ఆమెతో చించేశారు అని సైగ చేస్తూ చెప్పడం ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈ వీడియోతో యూత్ ఆడియన్స్‌కి బుట్టలో వేసుకుంది చిత్రయూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భీష్మ ఫస్ట్ గ్లింప్స్, ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచేసింది.

తాజాగా భీష్మ ఫస్ట్ గ్లింప్స్ చూసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. నితిన్, రష్మిక డామ్ క్యూట్ అంటూ పొగిడారు. ఇద్దరూ ఎవరికి వారే సూపర్ అంటూ ఆకాశానికెత్తేశాడు వరుణ్. ఆయన పెట్టిన ఈ కామెంట్ చూసి వెంటనే స్పందించిన రష్మిక.. థ్యాంక్యూ సార్ అని పేర్కొంది. వీళ్లిద్దరి ట్వీట్స్ చూసి వాటిపై లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'భీష్మ' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రష్మిక- నితిన్ జోడీ బాగా ఆకట్టుకోనుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే వీరిద్దరిపై విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా విడుదల చేసిన భీష్మ ఫస్ట్ గ్లింప్స్ ఆన్‌లైన్ వేదికలపై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











