»   » వరుణ్ తేజ్ మెగా లాంచ్, చిరు, పవన్, బన్నీ సందడి (ఫోటోలు)

వరుణ్ తేజ్ మెగా లాంచ్, చిరు, పవన్, బన్నీ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌ని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ పూజా హెడ్గేలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు వివి వినాయక్, రాఘవేంద్రరావు, తదితరలు హాజరయ్యారు. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

చిరంజీవి మాట్లాడుతూ...

చిరంజీవి మాట్లాడుతూ...

వరుణ్ తేజ్ ఫిల్మ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి మాట్లాడుతూ....నాగబాబు కొడుకంటే నా కొడుకు అన్నట్లే అని, వరుణ్ తేజను అభిమానులు ఆశీర్వదించాలని చిరంజీవి కోరారు.

వరుణ్‌కు బంగారు భవిష్యత్

వరుణ్‌కు బంగారు భవిష్యత్

రాఘవేంద్రరావు ఆశీర్వాదం తీసుకున్న వరుణ్ తేజ్‌కు బంగారు భవిష్యత్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు రావడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కాపీ క్యాట్ అల్లు అర్జున్

కాపీ క్యాట్ అల్లు అర్జున్

తాను వేసుకొచ్చినటువంటి నలుపు రంగు చొక్కానే అల్లు అర్జున్ కూడా వేసుకు రావడంతో.....వాడు క్యాపీ క్యాట్, నేను ఏమి వేసుకొస్తానో ముందే ఊహిస్తాడు అని వ్యాఖ్యానించారు. వెంటనే మైకు అందుకున్న అల్లు అర్జున్ డ్రెస్సు విషయంలోనే కాదు, డాన్స్ విషయంలోనూ తాను కాపీ క్యాట్ అనే అని వ్యాఖ్యానించారు.

సాలిడ్‌గా ప్రమోషన్స్

సాలిడ్‌గా ప్రమోషన్స్

నాగబాబు కొడుకు వరుణ్ తేజను ప్రమోట్ చేయడానికి మెగా హీరోలంతా కలిసి పని చేయనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

నాగబాబు పర్ ఫెక్ట్ ప్లానింగ్

నాగబాబు పర్ ఫెక్ట్ ప్లానింగ్

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు స్వయాన సోదరుడైన నాగబాబు....తన కొడుకు ఎంట్రీ కోసం పర్ ఫెక్టుగా ప్లానింగ్ చేసారు. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాగబాబుకు ఉంది.

పవన్, సాయి ధరమ్ తేజ్

పవన్, సాయి ధరమ్ తేజ్

రామానాయుడు స్టూడియోలో జరిగిన వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్...

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్‌ను సినీరంగానికి పరిచయం చేయడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పక్కాగా స్టోరీ, స్క్రిప్టు రెడీ చేసాడు. గోదావరి ఏరియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. గతంలో పంజా సినిమాలో మాదిరి గడ్డం పెంచాడు.

English summary
The Telugu film debut of Varun Tej, son of actor Nagababu, launched at the Ramanaidu Studios. Filmmaker Sreekanth Addala will be directing Nagendra Babu's son Varun Tej Konidala. Varun will be making his debut in Southern film industry and the creator of Kotha Bangaru Lokam will go behind the camera to capture his acting skills.This movie is produced by Nallamalupu Bujji and Tagore Madhu. music of the film composed by Mickey J Meyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu