మనవాళ్లకు తోడుగా నిలవాల్సిన సమయం వచ్చింది: వరుణ్ తేజ్
శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు తిత్లి తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా చాలా ఆస్తినష్టం జరుగడంతో పాటు ఎంతో మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
తిత్లి కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పలువురు ప్రజలు, సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50వేలు విరాళం ప్రకటించారు.
తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ రియాక్ట్ అయ్యారు. మనవాళ్లను ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. నా వంతు బాధ్యత పూర్తిచేశాను. ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావాలి అని ట్విట్టర్ ద్వారా కోరారు.

తిత్లి తుఫాన్ బాధితుల కోసం వరుణ్ తేజ్ రూ. 5 లక్షలు సహాయం అందించారు. మెగా ఫ్యామిలీ నుండి తిత్లి కోసం విరాళం అందించిన తొలి నటుడు వరుణ్ తేజ్ కావడం గమనార్హం. ఇతర స్టార్లు కూడా విరాళం ఇవ్వబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











