దానికోసం ఏదైనా చేస్తాను.. ఇంత గొప్ప జీవితం ఇచ్చినందుకు.. అంటూ వరుణ్ తేజ్ పోస్ట్
మెగా ప్రిన్స్‌గా అభిమానులతో పిలిపించుకుంటోన్న వరుణ్ తేజ్.. మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను దక్కించుకుంటున్నాడు. రీసెంట్‌గా గద్దలకొండ గణేష్ అంటూ పలకరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సరికొత్త లుక్‌లో, తెలంగాణ యాసలో అదరగొట్టేసి.. బాక్సాఫీస్‌ను రఫ్పాడించాడు.
నేడు(అక్టోబర్ 29) నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. జనసేన పార్టీ తరుపున కార్యకర్తలు కూడా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ తన మామ నాగబాబుపై ఉన్న ప్రేమను తెలుపుతూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

మెగా డాటర్ నిహారిక కూడా ఎంతో ఎమోషనల్ అయిన తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. గత జన్మలో తన కొడుకుగా పుట్టి ఉంటావని, తన తండ్రిలా ఇంకెవరూ నవ్వించలేరని, తన తండ్రి ప్రేమను దాచుకోవడానికి పెద్ద హృదయం కావాలి అంటూ తన తండ్రి గురించి ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది.
కాసేపటి క్రితమే వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుకు విషెస్ చెబుతూ... హ్యాపీ బర్త్‌డే నాన్నా.. నీ మొహంపై చిరునవ్వును చూడటానికి నేను ఏదైనా చేస్తాను..నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేశాడు. వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కనున్న మూవీతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











