మహేష్, ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ...దారిలో వరుణ్ తేజ్
హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవ్వడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా ఇతర మెగా హీరోల్లానే సక్సెస్ అవుతాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అతన్ని సక్సెస్ ఫుల్‌గా లాంచ్ చేసే నిర్మాత, దర్శకుడి కోసం మల్లగుల్లాలు పడ్డ మెగా ఫ్యామిలీ చివరకు పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా, అశ్వినీదత్‌ను నిర్మాతగా ఎంపిక చేసారు. ఫలితంగా 'చిరుత' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయ్యాడు రామ్ చరణ్. తాజాగా వరుణ్ తేజకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్.
నిర్మాత అశ్వినీదత్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయితే అతను సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడనే సెంటిమెంటు ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోయింది. గతంలో ఆయన ద్వారా వెండి తెరకు పరిచయమైన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లే ఇందుకు నిదర్శనం.

నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. చిత్రానికి దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ లోకి పూరీ జగన్నాథ్ వచ్చినట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. అయితే నిర్మాత మాత్రం అశ్వినీ దత్తే.

మహేష్ బాబు తొలి సినిమా ‘రాజకుమారుడు' అశ్వినీదత్ నిర్మించారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్‌ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది.

అల్లు అర్జున్ తొలి మూవీ ‘గంగోత్రి'కి అశ్వినీదత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

అశ్వినీదత్ నిర్మించిన ‘స్టూడెంట్ నెం.1' చిత్రంతోనే జూ ఎన్టీఆర్ తొలి హిట్ కొట్టాడు.

రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత'ను నిర్మించింది అశ్వినీ దత్ అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











