Ghani Release Date: పవన్ స్థానంలో వరుణ్ తేజ్.. భీమ్లా నాయక్ వచ్చేది ఎప్పుడంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి పుణ్యమా అని చాలా బడా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలవాల్సిన కొన్ని మూవీలు ఆంధ్రప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూ, యాభై శాతం ఆక్యూపెన్సీ కారణంగా వాయిదా పడిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో పెద్ద చిత్రాల రిలీజ్ డేట్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ విడుదల తేదీని ప్రకటించారు. తద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ వాయిదా పడినట్లు పరోక్షంగా వెల్లడించారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

‘గని'గా రాబోతున్న మెగా ప్రిన్స్

‘గని'గా రాబోతున్న మెగా ప్రిన్స్

వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న చిత్రమే ‘గని'. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేశాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

వరుస బ్రేక్‌లు... రిలీజ్ వాయిదా

వరుస బ్రేక్‌లు... రిలీజ్ వాయిదా

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించింది. ఆ తర్వాత కూడా కొన్ని డేట్లను అనుకున్నారు. కానీ, వరుస బ్రేక్‌లు రావడంతో సినిమా వాయిదా పడింది.

అప్‌డేట్లు షురూ.. బిజినెస్ భారీగా

అప్‌డేట్లు షురూ.. బిజినెస్ భారీగా

వరుణ్ తేజ్ ‘గని' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో ఇవన్నీ రెట్టింపు అయిపోయాయి. దీంతో ఈ సినిమా హక్కులకు కూడా పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమా బిజినెస్ అన్ని ఏరియాల్లోనూ భారీ మొత్తానికి జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రెండు రిలీజ్ డేట్లు... ఇదే ఫిక్స్

రెండు రిలీజ్ డేట్లు... ఇదే ఫిక్స్

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందిన ‘గని' మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన గని మూవీని వచ్చే ఏడాది మార్చి 18న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అదే సమయంలో పరిస్థితులు అనుకూలిస్తే దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు దీన్నే ఫిక్స్ చేసేశారు.

గని రింగ్‌లోకి దిగేది అప్పుడేనట

గని రింగ్‌లోకి దిగేది అప్పుడేనట

వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘గని' మూవీని మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 25నే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను యూనిట్ తాజాగా వదిలింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘భీమ్లా నాయక్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ కూడా ఇదే రోజున లేకపోతే.. ఏప్రిల్ 1న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గని మూవీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది.

Recommended Video

Ghani Teaser లో Ram Charan Mass | టాలీవుడ్ డిసెంబర్ రిలీజులు || Filmibeat Telugu
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అదే

భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అదే

ఫిబ్రవరి 25న గని మూవీ విడుదల అవుతోన్న నేపథ్యంలో ‘భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ డేట్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇక, దీన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయట్లేదని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నారని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ప్రకటన నేడే వెలువడనుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X