twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani Twitter Review: గని మూవీకి ఊహించని టాక్.. అదే బిగ్ మైనస్.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా అంటే!

    |

    సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన అతడు.. చాలా సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను కూడా అందుకున్నాడు.

    ఇక, ఈ మధ్య కాలంలో అతడు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'గని' అనే బాక్సింగ్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? వరుణ్ తేజ్ సినిమాపై ట్విట్టర్‌లో వస్తోన్న రిపోర్టులపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

    ‘గని'గా మారిపోయిన వరుణ్ తేజ్

    ‘గని'గా మారిపోయిన వరుణ్ తేజ్

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'గని'. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఇక, ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.

    పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు

    అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు

    బాక్సింగ్ నేపథ్యంలో ఫుల్ లెంగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గని' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లే దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

    బిజినెస్ భారీగా... రిలీజ్ గ్రాండ్‌గా

    బిజినెస్ భారీగా... రిలీజ్ గ్రాండ్‌గా

    వరుణ్ తేజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉండడంతో 'గని' మూవీ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో తీసుకు వస్తున్నారు.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!

    వరుణ్ తేజ్ మూవీకి షాకింగ్ టాక్

    వరుణ్ తేజ్ మూవీకి షాకింగ్ టాక్

    వరుణ్ తేజ్ - సయూ మంజ్రేకర్ జంటగా నటించిన 'గని' మూవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రొటీన్‌గా ఉందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

    ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

    'గని' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్ సీన్స్‌తో రొటీన్‌గా సాగిపోతుందట. కామెడీ సీన్స్ కూడా పర్వాలేదనిపిస్తాయట ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంటుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటుందని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే సీన్స్ ఉంటాయట. అలాగే, క్లైమాక్స్ కూడా బాగుందని తెలిసింది.

    Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

    సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

    సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

    'గని' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో వరుణ్ తేజ్ నటన, డైలాగ్స్, ఫిజిక్‌తో అదరగొట్టేశాడట. అలాగే, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే, ఊహించదగ్గ కథ, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, కామెడీ పేలకపోవడం, మొత్తంగా కొత్తదనం లేకపోవడం మైనస్‌లుగా మారాయని వీక్షకులు చెబుతున్నారు.

    మొత్తంగా గని ఎలా ఉందంటే!

    మొత్తంగా గని ఎలా ఉందంటే!

    ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ పాత కథతో వచ్చిన కొత్త సినిమా అని అంటున్నారు. దర్శకత్వ లోపంతో సినిమా నిరాశ పరిచేలా ఉందని వీక్షకులు చెబుతున్నారు. అయితే, ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లిన వాళ్లకు మాత్రమే ఇది నచ్చుతుందని సినిమాను చూసిన వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Mega Prince Varun Tej Now Doing Ghani Movie Under Kiran Korrapati Direction. Lets See This Movie Twitter Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X