twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక వరుణ్ తేజ్ ని తట్టుకోవడం కష్టమే..కజకిస్థాన్ లో అలా..!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు. వరుణ్ తేజ్ నటించిన ఫిదా, లేటెస్ట్ సెన్సేషన్ తొలిప్రేమ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. వరుణ్ కు ఇప్పుడు టాలీవుడ్ లో సపరేటు క్రేజు ఏర్పడింది. ఈ మెగా హీరోని ఫాలో అవడం యువత ప్రారంభించారు. వరుణ్ కు మార్కెట్ కూడా బాగా పెరిగింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఫార్ములాని వరుణ్ ఫాలో అవుతున్నాడట. తాజగా రెమ్యునరేషన్ పెంచేసి నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తరమైన చర్చ జరుగుతోంది.

    మెగా త్రయంలో సక్సెస్ కాని అతడు

    మెగా త్రయంలో సక్సెస్ కాని అతడు

    మెగా త్రయం చిరంజీవి, నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లలో నాగబాబు చిత్ర పరిశ్రమలో విజయవంతం కాలేదు. అటు నటుడిగా ఇటు నిర్మాతగా ఆయన రాణించలేకపోయారు. కానీ నాగబాబు తనయుడిగా వరుణ్ తేజ్ మాత్రం స్టార్ గా ఎదిగే అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నాడు.

    తొలి మెట్టు మాత్రమే

    తొలి మెట్టు మాత్రమే

    వరుణ్ తేజ్ కెరీర్ పరంగా తొలిమెట్టు విజయవంతంగా ఎక్కాడని చెప్పొచ్చు. ఆరంభంలో ఆశించిన సక్సెస్ లభించకపోయినా మంచి ప్లానింగ్ తో విజయం సాధించాడు.

    ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మటాష్

    ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మటాష్

    నిర్మాత గా నష్టాలని చవిచూసిన నాగబాబు అన్నదమ్ముల(పవన్, చిరు) అండ దండలతో నిలదొక్కుకుంటారు. వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తుండడంతో నాగబాబు ఫ్యామిలీ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. ఆ మధ్యనే వరుణ్ తన తండ్రికి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు కూడా.

    నటుడిగా గుర్తింపు.. ఆ తరువాత గేర్ మార్చాడు

    నటుడిగా గుర్తింపు.. ఆ తరువాత గేర్ మార్చాడు


    వరుణ్ తేజ్ కు మొదట విజయాలు దక్కకున్నా నటుడిగా పరిణితి కనబరిచాడు. కంచె చిత్రంలో వరుణ్ నటన అందరిని మెప్పించింది. ఫిదా చిత్రం నుంచి ప్రేమ కథలపై దృష్టి పెట్టడంతో వరుణ్ కెరీర్ టాప్ గేర్ లోకి దూసుకుపోయింది.

    వరుణ్ రెమ్యునరేషన్ ఎంత

    వరుణ్ రెమ్యునరేషన్ ఎంత

    వరుణ్ తేజ్ ఫిదా మరియు తొలిప్రేమ చిత్రాలకు ఒక్కోదానికి రూ 2.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల విజయంతో వరుణ్ సినిమాల మార్కెట్ 30 కోట్లకు పైగా విస్తరించింది.

    రేటు పెంచాడుగా

    రేటు పెంచాడుగా

    దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పద్దతిని వరుణ్ అవలంభించాడు. తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. 2. 5 కోట్లు తీసుకుంటున్న వరుణ్ తరువాతి చిత్రం నుంచి 4 కోట్లు పారితోషం అందుకోబోతున్నాడట.

    వైవిధ్యంపైనే దృష్టి

    వైవిధ్యంపైనే దృష్టి

    మూస బాటలో కమర్షియల్ చిత్రాలు కాకుండా విభిన్నత్వం ఉండే కథలు వైపు వరుణ్ ఆసక్తి చూపుతున్నాడు. ఘాజి చిత్రంతో అందరిని ఆశ్చర్య పరిచిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో వరుణ్ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

    కజకిస్థాన్ పయనం

    కజకిస్థాన్ పయనం


    వరుణ్ తేజ్ ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. స్పేస్ మూవీ కావడంతో అందుకు తగ్గట్లుగా మేక్ ఓవర్ చేంజ్ చేసుకునేందుకు వరుణ్ కజకిస్థాన్ పయనం కాబోతున్నట్లు తెలుస్తోంది. వెయిట్ లాస్ మరియు ఇతర ట్రైనింగ్ ని వరుణ్ అక్కడ పొందబోతున్నాడట.

    English summary
    Varun Tej hikes his remuneration. From next movie on words he will charge huge amount
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X