వరుణ్ తేజ ఎలక్షన్ కాంపైన్...పూర్తి డిటేల్స్

By Srikanya

హైదరాబాద్: నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హఠాత్తుగా ఎలక్షన్ క్యాంపైన్ లో దర్శనమిచ్చాడు. అమలాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమిటీ అని డౌట్ వచ్చిందా... ఇదంతా వరుణ్ తేజని లాంచ్ చేస్తూ శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ముకుంద చిత్రం షూటింగ్ లో భాగం ఇది. ఈ సినిమాలో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ ఎలక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు.

వరుణ్ తేజ అమలాపురంలోని గారపాటి వీధిలో ఇంటిటింకి వెళ్లి ఓట్లు అడుగుతున్న సీన్స్ ని షూట్ చేసారు. సీన్ ప్రకారం హీరోయిన్ పూజ హేడ్గే తన తండ్రి ,విలన్ రావు రమేష్ తరుపున ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతూంటే అక్కడ వరుణ్ తేజ కనపడతాడు. అతనివైపు చూస్తూ ఆమె కారు ఎక్కే సీన్ ని షూట్ చేసారు. వినాయిక చవితి రోజు ఈ సీన్ ని షూట్ చేసారు. తర్వాత ప్రకాష్ రాజ్ పై కొన్ని సీన్స్ ని సైతం తీసారు.

కుప కళ్యాణ మండపం దగ్గర వేసిన భోగిమంట వద్ద రాజకీయ కాలుష్యం ఈ మంటల్లో కడతేరిపోవాలి అంటూ ప్రకాష్ రాజ్ డైలాగు చెప్తూంటే షూట్ చేసారు. అనంతరం చిల్డ్రన్ పార్క్ వద్ద కూడా వరుణ్ తేజ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ ని షూట్ చేసారు. షూటింగ్ ని చూడటానికి అమలాపురం చుట్టు ప్రక్కల ఊళ్ల నుంచి స్దానికులు తరలి వచ్చారు

Varun Tej in election campaign

ఇక మొదటనుంచీ ... ఈ చిత్రానికి మొదటినుంచీ గొల్లభామ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కాకుండా... ముకుందా ని ఫైనల్ చేసారు. ఈ విషయాన్ని హీరో స్వయంగా జన్మాష్టమి రోజున ట్విట్టర్ లో తెలియచేసారు.

ముకుందా మురారి, ముకుందా అనే రెండు టైటిల్స్ పరిశీలించి, అందరూ...ముకుందా అనే టైటిల్ కి ఓటు వేయటంతో ఫైనల్ చేసారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో ప్రక్కన చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రం ని దసరాకు టార్గెట్ చేయటంతో ... నాగబాబు కొడుకు సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెలఖరుకు చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం.

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. ప్రస్తుతం అమలాపురంలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. '' అని అన్నారు.

లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X