నన్ను ముద్దుగా ‘వెదవ’ అని పిలుస్తారు: వరుణ్ తేజ్, ప్రభాస్ కంటే అంగుళం ఎక్కువే!
మెగా ఫ్యామిలీ నుండి మరో నటుడు స్టార్ ఇమేజ్ సర్కిల్‌లోకి వచ్చేశాడు. 'ఫిదా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు తాజాగా విడుదలైన 'తొలి ప్రేమ' చిత్రం ద్వారా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు వరుణ్ తేజ్. ఈ విజయంతో ఆనందంగా ఉన్న వరుణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Recommended Video


రియల్ లైఫ్‌లో ప్రియురాలు లేదు
‘తొలి ప్రేమ' చిత్రంలో తన క్యారెక్టర్‌కు రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుందని, తనకు రియల్ లైఫ్‌లో ప్రియురాలు లేదని వరుణ్ తేజ్ తెలిపారు. అయితే స్కూల్ డేస్‌లో ఓ చిన్న లవ్ స్టోరీ ఉండేదన్నారు.

ప్రస్తుతం సింగిల్
ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నాను, ఎవరైనా అమ్మాయి నా జీవితంలోకి వస్తే తప్పకుడా అందరికీ చెబుతాను అని వరుణ్ తేజ్ తెలిపారు. తనకు అమ్మాయిలతో మాట్లాడాలంటే మొహమాటం కాస్త ఎక్కువే అని వరుణ్ తెలిపారు.

రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు?
ప్రస్తుతం మీరు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నకు వరుణ్ తేజ్ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఇపుడు బయటకు చెబితే ఐటీ సమస్యలు వస్తాయన్నారు. సినిమాను బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు.

నన్ను ‘వెదవా’ అని పిలుస్తారు
ఇంట్లో ఉన్నపుడు నాన్న ముద్దుగా ‘వెదవ' అని పిలుస్తారని, అమ్మ వరుణ్ బాబూ అని పిలుస్తూ ఉంటుందని వరుణ్ తేజ్ తెలిపారు. ఫ్రెండ్స్ వరుణ్ అని పిలుస్తారంటూ... ఈ మెగాప్రిన్స్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ప్రభాస్ గురించి...
ఈ ఇంటర్వ్యూలో బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తావన రావడంతో వరుణ్ తేజ్ తనదైన రీతిలో స్పందించారు. ప్రభాస్‌తో గుడ్ ఫ్రెండ్షిప్ ఉందని, హైట్ విషయంలో ప్రభాస్ కంటే ఒక అంగుళం ఎక్కు హైట్ ఉంటానని వరుణ్ తేజ్ తెలిపారు.

నెక్ట్స్ మూవీ గురించి
తన తర్వాతి ప్రాజెక్టు గురించి వరున్ తేజ్ వెల్లడిస్తూ.... ‘ఘాజీ' చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు.

అభిమనులందరికీ ధన్యవాదాలు
‘తొలి ప్రేమ' చిత్రాన్ని ఆదరిస్తున్నఅభిమానులకు, ప్రేక్షకులకు వరుణ్ తేజ్ ధన్యవాదాలు తెలిపారు. తన ఇమేజ్‌కు సరిపోయే విధంగా, అభిమానులకు నచ్చే విధంగా ఉండే కథలను ఎంచుకుంటానని తెలిపారు.


Click it and Unblock the Notifications











