పూరి-వరుణ్ తేజ్ మూవీ టైటిల్ ‘అందగాడు’?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సి.అశ్వనీదత్ నిర్మాత. ఇప్పటికే చిరుత ద్వారా రామ్ చరణ్ తేజను సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్లో లాంచ్ చేసిన పూరిపై పూర్తి నమ్మకంతో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను కూడా పూరి ద్వారానే లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైంది.
మాస్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మెగా హీరోలంతా మాస్ ఇమేజ్‌తోనే స్టార్ హీరోలుగా ఎదిగారు. వరుణ్ తేజ్ కూడా ఆ రేంజికి ఎదగాలంటే మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటేనే బెటరనే ఆలోచనతో పూరిని దర్శకుడిగా ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్లాన్ చేసారు. కారణం ఏంటో తెలియదు అతన్ని మార్చి పూరికి అప్పజెప్పారు. పూరి డైరక్ట్ చేసే 'అందగాడు' చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఇక పూరీ రీసెంట్ చిత్రం ఇద్దరమ్మాయిలతో భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించింది.


Click it and Unblock the Notifications











