Official: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ కార్డ్ వైరల్.. 2 హృదయాలంటూ అధికారిక ప్రకటన!

మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. హ్యాండ్సప్ మూవీలో బాల నటుడిగా చేసిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి హిట్లు అందుకున్నాడు.

ఇక వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ జరగనుందని టాక్ కూడా వచ్చింది. అయితే ఈ విషయంపై ఇప్పుడు అధికారికంగా ఓ ప్రకటన అయితే వచ్చేసింది.

Varun Tej Lavanya Tripathi Official Engagement Card Viral On Social Media

ఎంతోకాలంగా: మెగా వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఊహగానాలు ఎంతో కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో లావణ్య కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

Varun Tej Lavanya Tripathi Official Engagement Card Viral On Social Media

తగ్గుముఖం: ఇక వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి విన్నర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని జోరుగా కామెంట్స్ వచ్చాయి. గతంలో వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి.

Varun Tej Lavanya Tripathi Official Engagement Card Viral On Social Media

జోరుగా వార్తలు: అయితే ఈ మధ్య పులి మేక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పై లావణ్య చేసిన కామెంట్స్ తో మళ్లీ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ డేటింగ్ వార్తలపై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎవరూ స్పందించలేదు. ఆ రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక ఆ పుకార్లు నిజం అవుతున్నట్లుగా వారిద్దరు జూన్ 9న ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.

Varun Tej Lavanya Tripathi Official Engagement Card Viral On Social Media

అధికారిక ప్రకటన: మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలోనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగనుందని, అందుకు ఏర్పాట్లు కూడా మొదలయయ్యాని టాక్ వచ్చిది. కానీ దానిపై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్ని నిజమే అని అఫిషీయల్ అనౌన్స్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్కటే ప్రేమ: "ఎన్నో రోజులుగా ఎదురుచూసిన మధురక్షణం రానే వచ్చేసింది. ఇది అఫిషియల్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అంటూ వరుణ్-లావణ్య జూన్ 9న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ ఎంగేజ్ మెంట్ కార్డులో "రెండు హృదయాలు ఒక్క ప్రేమ" అని రాసి వరుణ్ తేజ్, లావణ్య ఫొటోలు ఉన్నాయి.

కంగ్రాట్స్ అంటూ: ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కార్డ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి ఈ కార్డ్ ఒరిజినలా.. లేదా ఫేకా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ పోస్ట్ మెగా ఫ్యామిలిలో ఏ ఒక్కరు షేర్ చేయలేదు. కానీ నెట్టింట్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X