Varun Tej Mehandi Photos పెళ్లికి సిద్దమైన వరుణ్, లావణ్య..120 మంది గెస్టులు ఎవరంటే?..హీరో నితిన్ ఎట్రాక్షన్‌గా
ఇటలీలోని అతి పురాతన గ్రామంలో జరుగుతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ ఏర్పాటు చేసిన కాక్ టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీ, లావణ్య కుటుంబ సభ్యులు, అతిథులు ఎంజాయ్ చేశారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు, అలాగే హల్దీ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్టోబర్ 31వ తేదీన జరిగిన మెహందీ కార్యక్రమం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన విశేషాల వివరాల్లోకి వెళితే..
ఇటలీలోని 8వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన గ్రామంలో వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతున్నది. పురాతన గ్రామంలో ఆయన తన అతిథులకు, కుటుంబ సభ్యులకు భారీగా కాక్‌టెయిల్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ తర్వాత మరో మూడు రోజులపాటు పెళ్లి కార్యక్రమాలను ఆస్వాదించండి అంటూ సోషల్ మీడియాలో లేఖను రాశారు.

అక్టోబర్ 31వ తేదీన జరిగిన మెహందీ వేడుకల్లో హీరో నితిన్ తన సతీమణితో కలిసి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో నాగబాబు దంపతులు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మెహందీ కార్యక్రమానికి సంబంధించిన వేదికను అద్బుతంగా తీర్చి దిద్దారు. అలాగే శిరీష్‌తో వరుణ్ తేజ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ఇక మెహందీ వేడుకల్లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. దాదాపు ఈ కార్యక్రమంలో దాదాపు 120 మంది అతిథులను ఆహ్వానించారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అతికొద్ది మంది సినీ ప్రముఖులు ఇటలీ చేరుకొన్నారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరుగనున్నది. ఇటలీలో ప్రారంభమైన వీరిద్దరి ప్రేమ కథకు ఇటలీలోనే ముగింపు పలకడం విశేషంగా మారింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకొంటూ ఒక్కటవుతున్న వరుణ్ లావణ్యకు ఫిల్మీబీట్ తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.


Click it and Unblock the Notifications











