'ఆచార్య' టీజర్‌లో ఆ హీరో వాయిస్ ఓవర్.. మరో మీమ్‌తో లీక్ చేసిన వరుణ్ తేజ్!
ఒక స్టార్ హీరో సినిమా విడుదలకు సిద్ధమయ్యింది అంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ మాములుగా ఉండదు. ఇక మెగా హీరోల సినిమాలు ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆచార్య సినిమాకు మునుపెన్నడూ లేనంతగా మెగా హీరోలు మీమ్స్ తో ప్రమోట్ చేస్తుండడం వైరల్ గా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తరువాత వెంటనే వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగాడు.

అనుకోకుండా టైటిల్ రివీల్..
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా వెళ్లడం అభిమానులను అసహనానికి గురి చేసింది. కానీ సినిమా అప్డేట్స్ అఫీషియల్ గా కాకుండా అనుకోకుండా హఠాత్తుగా వస్తున్నాయి. ఇక మెగాస్టార్ ఒక సినిమా ఫంక్షన్ లో ఏకంగా ఆచార్య టైటిల్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.

చరణ్ రోల్ పై కూడా..
ఒక మంచి టైమ్ చూసుకొని దర్శకుడు కొరటాల టైటిల్ ను పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేయాలని అనుకున్నాడు. కానీ మెగాస్టార్ తొందరపడి అనుకోకండా లీక్ చేసేశారు. అనంతరం రామ్ చరణ్గెస్ట్ రోల్ పై కూడా హడావుడి లేకుండానే చెప్పేశారు మెగాస్టార్. రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సిద్దా అనే పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

వైరల్ అయిన మెగా మీమ్
ఇక మంగళవారం సినిమాకు సంబంధించిన టీజర్ డేట్ విషయంలో సరదాగా వదిలిన మీమ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. నువ్వు టీజర్ డేట్ ఎనౌన్స్ చేస్తావా లేక లీక్ చేయమంటావా.. అంటూ కొరటాలతో మెగాస్టార్ సీరియస్ గా చర్చిస్తున్నట్లు మీమ్ వదిలారు. మెగాస్టార్ స్వయంగా మీమ్ వదలడం అభిమానులకు మంచి కిక్కిచ్చింది.

వరుణ్ కూడా లీక్ చేసేశాడు
ఇక మొత్తానికి టీజర్ ను జనవరి 29న సాయంత్రం 4:05గంటలకు విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే వరుణ్ తేజ్ మరో మీమ్ లో ఇంపార్టెంట్ విషయాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ ఉంటుందంటగా అంటూ బ్రహ్మీ స్టైల్ లో మీమ్ క్రియేట్ చేయడం వైరల్ అయ్యింది. అది ఎంతవరకు నిజమో గాని మెగా మీమ్స్ ఇప్పట్లో ఆగేలా లేవని అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











