రండి అందరం కలిసి ఆ పని చేసేద్దాం.. చిరు బర్త్ డే సందర్బంగా వరుణ్ తేజ్ పిలుపు

Recommended Video

#HBDChiranjeevi : Varun Tej Special Message To Mega Fans || Filmibeat Telugu

మెగా అభిమానుల పండుగ రోజు రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో అనగా ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా రక్తదానం, నేత్రదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానులకు సందేశమిస్తూ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు చూస్తే..

గతంలో కంటే స్పెషల్.. మెగా అభిమానుల ఆత్రుత

గతంలో కంటే స్పెషల్.. మెగా అభిమానుల ఆత్రుత

ఈ ఏడాది చిరంజీవి చేసుకోబోతున్న ఈ పుట్టిన రోజును ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు మెగా అభిమానులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మెగా అభిమానులు భారీ హంగామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో ఇప్పటికే మెగాస్టార్ పుట్టినరోజుకు సంబందించిన కార్యక్రమాలు మొదలు పెట్టేశారు.

వైరల్ అవుతున్న మెగాస్టార్ కామన్ డీపీ

వైరల్ అవుతున్న మెగాస్టార్ కామన్ డీపీ

ఇక మరోవైపు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా మెగాస్టార్ కామన్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవవుతోంది. మెగాస్టార్ నటించిన సినిమాల్లోని ఇంట్రెస్టింగ్ లుక్స్ అన్నీ ఒకదగ్గర చేర్చి ఈ కామన్ డీపీ రెడీ చేశారు. ఈ డీపీని తన ట్విట్టర్ ఖాతాకు ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న వరుణ్ తేజ్.. మెగా అభిమానులకు తన సందేశం పోస్ట్ చేశాడు.

చిరు బర్త్ డే సందర్బంగా ఇలా చేద్దాం..

మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా కుటుంబమంతా చిరంజీవి పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్బంగా సామాజిక కోణంలో మెగా అభిమానులకు పిలుపునిచ్చాడు వరుణ్ తేజ్. ''మెగా అభిమానులారా రండి.. అందరం కలిసి వరద బాధితులకు సహాయం చేద్దాం'' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

చిరంజీవి బర్త్ డే స్పెషల్

చిరంజీవి బర్త్ డే స్పెషల్

ఇక చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆయన తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' నుంచి టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ లో చూపించిన సన్నివేశాలు మెగా అభిమానులను అబ్బురపరిచాయి. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట హల్చల్ చేస్తూ వేగంగా వ్యూస్ రాబడుతోంది.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా తమన్నా ముఖ్యపాత్ర పోషించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X