వరుణ్ తేజ్ మూవీ ‘గొల్ల భామ’ సంగతులేంటి?
హైదరాబాద్: నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల కేరళలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యానాంలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సాధారణంగా తొలి సినిమా అనగానే పెర్ఫార్మెన్స్ పరంగా కాస్త పూర్‌గా ఉంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం యాక్టింగ్, డాన్స్ తదితర అంశాల్లో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడట. పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నవాడిలా వీలైనంత వరకు ఎక్కువగా టేకులు తీసుకోకుండా పర్‌ఫెక్టుగా చేస్తున్నాడట.

వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్‌పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి తర్వాలోనే వరుణ్ తేజ్ తెలుగులో మంచి హీరోగా ఎదుగుతాడని అంటున్నారు. కొడుకు టాలెంట్ గురించి అంతా ఇలా పాజిటివ్‌గా మాట్లాడుతుండటంతో నాగ బాబు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడట.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన కన్నడ భామ పూజా హెడ్గే నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో వరుణ్‌తేజ్ తొలి చిత్రంపై మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











